A majority of the naxal leadership hails from a single district of telangana a legacy that haunts its demand for statehood

Naxal leadership, naxals in telangana, telanagna naxals, telangana naxals incidents, recent incidents on naxals

A majority of the Naxal leadership hails from a single district of Telangana, a legacy that haunts its demand for statehood. naxals in telangana

అడవుల్లో అన్నల తుపాకుల మోతలు తెలంగాణాలో మళ్ళి వినబడనున్నాయా..!!

Posted: 12/29/2014 06:38 PM IST
A majority of the naxal leadership hails from a single district of telangana a legacy that haunts its demand for statehood

గత రెండు రోజుల నుండి ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పోలీస్ ల కూంబింగ్ కొనసాగుతుంది. మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ దళాలకు మధ్య ఎదురు కాల్పులు కూడా కొనసాగినట్లు తెలుస్తుంది. 40 మంది మావోయిస్టులు ఒక సెల్ టవర్ ను పేల్చటానికి వచ్చారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు రంగం లోకి దిగి అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
 
చాలా సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లాలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారన్న సమాచారం పోలీసులకు ఆందోళన కలిగిస్తోంది. అంతేకాక తీవ్రవాద సమస్య పూర్తిగా తొలగిపోయిందని, తెలంగాణ ఏర్పాటు తర్వాత మావోయిస్టులు పెరుగుతారన్న వాదన సరికాదని గతంలో వాదించిన తెలంగాణవాదులకు ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం ముకునూరు గ్రామంలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి, కొందరు గ్రామస్తులను కొట్టారని కూడా ప్రచారం జరుగుతోంది. గ్రామస్తులలో కొందరు ఇన్ ఫార్మర్లు ఉన్న అనుమానంతోనే వారు ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

అయితే పోలీసులు ప్రజాకోర్టు వంటివి ఏమీ జరగలేదని, కొందరు గ్రామస్తులు దసరానాడు గ్రామంలో వచ్చిన ఒక వివాదం అంశంలో మావోయిస్టులను కలిసి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు. సుమారు ఇరవై మంది సాయుధులైన మావోయిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనల నేపథ్యంలో తెలంగాణా లో అన్నలు తమ ఉనికిని మళ్ళి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానమూ లేకపోలేదని కొందరు మేధావులు భావిస్తున్నారు. తమ పూర్వ వైభవాన్ని చాటుకోవాలనే ఆతృతను వారు కనబరిచే వకాశం లేకపోలేదని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కాని ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మావోయిస్టులు తమ క్యాడర్ ను పెంచుకునేందుకు ప్రయతన్లు మొదలు పెట్టినట్లు బయట కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naxals in telangana  police comning operation  telangana state  

Other Articles