Central government should kill dawood ibrahim like ladden incident shivasena party says

central government india, dawood ibrahim, pakistan incident on dawood ibrahim, dawood ibrahim pakistan terrorist

central government should do some thing on dawood ibrahim government should kill him like ladden incident

పాకిస్తాన్ లాంటి దేశమే అలాంటి వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తుంది

Posted: 12/29/2014 04:11 PM IST
Central government should kill dawood ibrahim like ladden incident shivasena party says

దావూద్ ఇబ్రహీం లాంటి వ్యక్తులా ఆచూకి తెలిసిన కేంద్ర ప్రభుత్వం ఎం చేయలేకపోవటం ఏంటని శివసేన ప్రశ్నించింది. అత్యంత కరడు గట్టిన ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం లాంటి వ్యక్తులు పాకిస్తాన్ లో హాయి గా వారి రాజకీయ సంరక్షణలో స్వేఛ్చ గా తిరుగుతున్నారని, బహుశ సగటు మనిషికి కూడా లాంటి రాజ భోఘాలు అనుభవించే అవకాశం రాకపోవచ్చు కాని ఎన్నో ప్రాణాలు పోవటానికి కారణమైన ఆ కర్కోటకులు మాత్రం విలాసవంతంగా గడుపుతున్నారని తన పార్టీ పత్రిక అయిన సామ్నా సంపాదకీయంలో వివరించింది. వారు అలా దర్జా గా తిరగటానికి ఏ సాక్షాలు ఏ నిరూపణలు అవసరం లేదని, పాకిస్తాన్ తప్ప మరే దేశం కూడా అలాంటి వ్యక్తులకు ఆశ్రయం కల్పించదని శివసేన ఆ సంపాదకీయంలో పేర్కొంది.

తప్పించుకు తిరుగుతున్న అలాంటి చీకటి నిందితుల విషయం లో ఇప్పటికే పలు మార్లు భారత్, పాకిస్తాన్ కు విజ్ఞప్తి చేసిందని కాని కనీసం వారు తమ దేశం లో ఉన్నారని కాని లేదా వారిని పట్టుకోవటానికి సహకరించటం కాని ఏ విధమైన సహాయం చేయలేదు. కనుక తన దేశం లో జరిగిన ఒక్క ఘటన కే లాడెన్ ను అమెరికా వేటాడి వేటాడి మరీ చంపిందని భారత్ కూడా అదే విధంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తూ, అమెరికా చేసినట్లుగానే భారత్ కూడా అదే విధంగా వ్యవహరించాలని శివసేన తెలిపింది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dawood ibrahim  pakistan  shivasena samna  

Other Articles