Ysrcp mangalagiri mla alla ramakrishna reddy takes on chandrababu naidu

Ysrcp mangalagiri mla ramakrishna reddy, Ycp mla ramakrishna reddy, Ycp mla ramakrishna reddy, mangalagiri mla ramakrishna reddy, mla ramakrishna reddy criticises chandrababu government, mla ramakrishna reddy criticizes TDP government, Andhrapradesh capital villages farmers, chandrababu, AP chief minister chandrababu

Ysrcp mangalagiri mla ramakrishna reddy criticizes Andhrapradesh government on capital, says farmers are sleeping in their fields instead of houses.

రాజధాని రైతుల గుండెల్లో రైళ్లు.. పంటను కాపాడుకునేందుకు పాట్లు..

Posted: 12/29/2014 01:18 PM IST
Ysrcp mangalagiri mla alla ramakrishna reddy takes on chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ రాజధాని తూళ్లూరు పరిసర ప్రాంతాల్లో వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ఆ ప్రాంత రైతాంగం గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి స్వచ్ఛందంగా భమూములు ఇవ్వాల్సిన రైతులు ప్రభుత్వం అమోదించి సీఆర్డీఏ బిల్లులో అస్పష్టత కారణంగా భూములు ఇచ్చేందుకు జంకుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తమ భూములు తీసుకుంటుందన్న ప్రకటనతో వారిలో ఆందోళన తీవ్రమైందన్నారు.

రాజధాని గ్రమాల రైతాంగం ఇళ్లను వదిలి.. పొలాల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సుమారు 8 నుంచి 10 మంది దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని రైతులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దుండగులను గుర్తించి కేకలు వేసేలోపే వాళ్లు పారిపోయారని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టిస్తున్న ఘటనలపై స్పందించిన రైతాంగం తమ పోలాల్లో ఎక్కడ బీభత్సం చేస్తారోన్న అంధోళనతో విపరీతమైన చలిలోనూ వారు తమ పోలాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేరకొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  andhrapradesh capital villages farmers  TDP government  

Other Articles