Bangalore blast 37 year old woman killed terrosrist attacks in india

bangalore blast, terrorist attacks in india, terrorism in india, recent terrorist attacks in india, recent bangalore blast, mumbai attacks, india on terrorism issue

Bangalore blast, bengaluru blast, Bangalore, blast in bangalore Police officials on spot where a low intensity bomb blast occurred at church street in banglore

ఈ బెంగళూరు పేలుడు దేనికి సంకేతం..!?

Posted: 12/29/2014 11:09 AM IST
Bangalore blast 37 year old woman killed terrosrist attacks in india

గత కొన్ని రోజుల క్రితమే వాస్తవంగా చెప్పాలి అంటే గత కొన్ని నెలల క్రితమే నిఘా వర్గాలు, ఎన్ ఐ ఏ వర్గాలు కూడా రాష్ట్ర పోలీస్ యంత్రాంగాలను, రాష్ట్ర హోం శాఖాలను హెచ్చరిస్తూ వచ్చాయి. దేశంలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పుడది నిజమైంది. ఎందుకంటే గతంలో బెంగుళూరులో ఒక ఉగ్రవాద సంస్థకు సహాయం అందిస్తున్నాడన్న అనుమానంపై ఒక యువకున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడే కొన్ని విషయాలు వెలుగు చూశాయి. అప్పుడే నిఘా సంస్థలకు కొంత అనుమానం కలిగింది. దేశం లోని ఏదొక ప్రాంతం విధ్వంస రచనకు ఉగ్రవాద సంస్థలు పథకం పన్నుతున్నట్లు అర్దమైంది. అందుకే అప్పుడే అన్ని యంత్రాంగాలను అప్రమత్తం చేసి కొన్ని సూచనలను జారీ చేశాయి. ఒక విధంగా చెప్పాలి అంటే మన నిఘా సంస్థల పని తీరు హేతుబద్దంగా ఉండటం వల్లే కొంత వరకు ఉగ్రవాద సంస్థలను వెనకడుగు వేసెల చేస్తున్నాయని చెప్పవచ్చు. కాని ఆ నిఘా సంస్థల సమాచారాన్ని మన పోలీస్ యంత్రాంగాలు, స్థానిక బలగాలు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాయన్నదే ప్రశ్నార్థకం.

ఇప్పుడు బెంగుళూరు లో జరిగిన పేలుడు మన దేశానికి కేవలం ఒక హెచ్చరిక పంపినట్లు గానే కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. త్వరలో వారు జరిపే విధ్వంస ఖాండ కు ఇదొక సంకేతం మాత్రమే అయి ఉండవచ్చునని కొన్ని వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గత చేదు జ్ఞాపకమైన ముంబై మారణ ఖాండ తర్వాత ఉగ్రవాదులు మల్లి అలాంటి ఇంకో విధ్వంసానికి తెర తీసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయకపోరేమో అన్న అనుమానం లేకపోలేదు.

ఈ మధ్య ఉగ్రవాదం పై ఎన్నో అంతర్జాతీయ సమావేశాల్లో ఉగ్రవాదం పై పోరాడాలని గొంతెత్తి అరుస్తూ తనదైన వాణిని వినిపిస్తూ వస్తుంది. అనేక సమావేశాల్లో ముందుగా మన దేశమే ఉగ్రవాదం పై కఠినాత్మక వైఖరి అవలంభించాలని పలు దేశాలకు సూచిస్తూ వచ్చింది. ఐరాస సమావేశాల్లో కూడా ఉగ్రవాదన్ని, ఉగ్రవాదం వాళ్ళ తీవ్ర నష్టాన్ని కూడా ముఖ్త కంటం తో ఖండిస్తూ ఎన్నో తీర్మానాలను చేసింది. కొన్ని విషయాల్లో మనం కూడా కఠిన వైఖరులను అనుసరించాల్సిన అవసరం కూడా ఉందేమో. ఇప్పటికే మన దేశం లో పేలుళ్లు జరిపి పక్క దేశాలలో దర్జా గా తీరుగుతున్న నిందితులను ఎం చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. అదే అగ్ర రాజ్యమైన అమెరికా తన దేశం లో జరిగిన wtc టవర్ల పేలుళ్ల ఉదంతానికి తీవ్రంగా స్పందించింది. దానికి కారణమైన నిందితుడిని అది వదిలిపెట్టలేదు. ఎక్కడో దాక్కున్న నిందితుడిని కొన్ని సంవత్సరాల వరకు కూడా వెతికిపట్టుకొని మరి లాడెన్ లాంటి భయంకరమైన ఉగ్రవాదిని సైతం హత మార్చింది. మన దేశం కూడా అలాంటి కఠినాత్మక వైఖరులను అనుసరిస్తే మన దేశం వైపు ఎవరూ కూడా కన్నెత్తి చూడకపోవేచ్చేమో..!

ఏది ఏమైనా నిన్న జరిగిన పేలుడుకు ఒక మహిళ నిండు ప్రాణం బలైంది. ఆ మహిళా మన దేశంలొనిఉ ఒక కుటుంబాన్ని చీకట్లలోకి నెట్టింది. ఇది మనం మర్చిపోకుడదేమో! మనం కోల్పోయింది ఒకే ప్రాణం కావచ్చు. పేలుడు తీవ్రత తక్కువే కావచ్చు.., కాని వేల హృదయాలు ఆందోళనతో బిక్కు బిక్కు మంటున్నాయి. ఈ పేలుడు తర్వాత ఇంకా ఎంత పెద్ద పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని కొన్ని వర్గాలు తమ ఆందోళనను వ్యక్తపరుస్తునాయి ఇప్పటికే మన దేశం అంతర్గత సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతుంది. సగటు ఆడపిల్లల అత్యాచారాలు, పేదరికం, నిరుద్యోగం ఇలాంటి సమస్యలతో ఉన్న మన దేశానికి ఉగ్రవాదం అనే భయంకరమైన భూతం పెను సవాలుగా నిలవనుంది. ఈ సవాలు కు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు, కాకలు తీరిన నిఘా వర్గాలు, మన పోలీస్ వ్యవస్థ పటిష్టమైన పోలీస్ వ్యవస్థ అని చెప్పుకొనే పోలీస్ యంత్రాంగాలు ఎలా ఎదురొడ్డి నిలుస్తాయో చూద్దాం. అదే సమయంలో ప్రజలు కూడా ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందేమో!

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore blast  terrorist attacks  one woman killed  

Other Articles