Nina davuluri in vijayawada interview

nina davuluri, nina davuluri in vijayawada, nina davuluri biography, nina davuluri twitter, nina davuluri facebook, nina davuluri telugu, nina davuluri on movies, miss america 2014, miss us 2014, nina davuluri charity, nina davuluri social service, nina davuluri photos, miss india 2014, fashion shows, tollywood latest, tollywood updates, vijayawada latest, vijayawada news

nina davuluri in vijayawada interview : 2013 year miss america nina davuluri came to hometown vijayawada for private programme. nina davuluri says she will not act in movies not interested in films. nina davuluri praised telugu earth earth and telugu culture

నీనా దావులూరి ఇంటర్వ్యూ స్పెషల్

Posted: 12/28/2014 08:16 AM IST
Nina davuluri in vijayawada interview

మాజీ మిస్ అమెరికా, తెలుగమ్మాయి నీనా దావులూరి శనివారం (28-12-14) విజయవాడకు వచ్చింది. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండియా వచ్చిన నీనా.., పుట్టిన నేలపై ప్రేమతో బెజవాడ చేరుకుంది. స్థానికంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. నీనా సంబంధీకులు, చిన్నప్పటి స్నేహితులు ఆమెను చూసేందుకు వచ్చారు. నగరంలోని ఓ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో నీనా మాట్లాడారు. తన అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించారు.

తెలుగమ్మాయిగా, విజయవాడ బిడ్డగా చాల గర్విస్తున్నట్లు చెప్పారు. పుట్టిన నగరంపై ఉన్న ప్రేమే తనను ఇక్కడకు తీసుకువచ్చిందన్నారు. చిన్నపుడు ఇక్కడి వీధుల్లోనే తిరిగాను, ఆడుకున్నాను అని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. మిస్ అమెరికా హోదాలో చాలా ఛారిటీ సంస్థల తరపున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను అని వివరించారు. ప్రజలకు సేవ చేయటం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు.

సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ ఏదైనా.., సినీ ఇండస్ట్రీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. తనకు ప్రస్తుతం సేవా కార్యక్రమాలు ముఖ్యమని.., వాటిపైనే దృష్టిపెట్టినట్లు చెప్పారు. కాస్త కళ, కలర్ ఉంటే చాలు ఇండస్ట్రీని ఊపేయాలని అందగత్తెలు ఆరాటపడుతున్న తరుణంలో.., మిస్ అమెరికా అయినా సరే సినిమాలు వద్దు సేవే ముద్దు అని నీనా చెప్పటం సమాజం పట్ల ఆమెకు ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nina davuluri  vijayawada  miss america  

Other Articles