List of ias officers allocated to telangana and andhra pradesh

telangana ias officers list, andhra pradesh officers list, andhra pradesh ips officers list, telangana ips officers list, officers list in telangana and andhra pradesh

Distribution of ias and ips Officers between andhra Pradesh and Telangana

ఈ జాబితా వాళ్ళకు ఇబ్బందులు తెచ్చేలా ఉంది...!!

Posted: 12/27/2014 12:41 PM IST
List of ias officers allocated to telangana and andhra pradesh

ఐఏఎస్ ల విభజన జాబితా ను కేంద్రం విడుదల చేసింది.. అంతవరకు బానే ఉంది కాని ఇప్పుడు కొందరు ఐఏఎస్ లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్ళటం తీవ్ర సంకటంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం పనిచేసింది ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు పని చేయాల్సింది తెలంగాణాలో.. ఇంకొందరు అధికారులు ఇప్పటివరకు పని చేసింది తెలంగాణా లో ఇప్పుడు పని చేయాల్సింది ఆంధ్ర ప్రదేశ్ లో... తాజాగా కేంద్రం ఆమోదించి పంపిన జాబితాలో ఈ విషయాలు ఉన్నాయి. ఇంతవరకు బానే ఉన్న ఇప్పటివరకు అక్కడ పని చేసిన అధికారులు వాళ్ళు పని చేసిన చోట ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళి ఇంకో ప్రభుత్వానికి పని చేయాల్సి వస్తుంది.

దీని ప్రకారం సీనియర్ అదికారి అయిన చందనాఖన్ ఎపి నుంచి తెలంగాణకు వెళతారు. ఆమె ఒకసారి ఎపి తరపున గచ్చి బౌలి స్టేడియం వద్ద ధర్నాకు దిగారు. మరి ఇప్పుడు ఆమె తెలంగాణ తరపున వాదించాల్సి ఉంటుంది. కాగా మరో సీనియర్ అదికారి బిపి ఆచార్య ఇంతవరకు తెలంగాణలో పనిచేయగా , ఆయనను ఎపికి బదలాయించారు. అలాగే పూనం మాలకొండయ్య, సోమేష్ కుమార్ వంటి సీనియర్ అదికారులు తెలంగాణలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. వారు ఇప్పుడు ఎపికి వెళ్లవలసి ఉంటుంది. సోమేష్ కుమార్ పై అప్పట్లో అయ్యప్ప సొసైటీ ఇళ్ల కూల్చివేతకు సంబందించి టిడిపి పార్టీ విమర్శలు చేసింది. ఇప్పుడు ఆయన ఎపి అదికారి అవుతున్నారు. మళ్లీ రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో వీరిని వెనక్కి తీసుకుంటాయా? లేదా అన్నది చూడాలి. కొందరు దంపతుల విషయంలో కూడా చెరో రాష్ట్రానికి కేటాయించారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పని చేస్తున్న అధికారులు ఇంకో రాష్ట్రానికి వెళ్ళాల్సి రావటం పట్ల తీవ్ర తర్జన భర్జనలు పడే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

source: N TV


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana and andhra pradesh  officers list  allocated  

Other Articles