Money rain in hong kong prompts sprint for free cash money on road

hong kong money incident, hong kong recent incident, hong kong cash incident, money on road in hong kong

money notes on road people are trying to catch that money on road, police trying to recover that money

ITEMVIDEOS: రోడ్డుపై ఒక్కసారిగా డబ్బు వర్షం, నోట్లను ఏరుకున్న ప్రజలు

Posted: 12/26/2014 11:07 AM IST
Money rain in hong kong prompts sprint for free cash money on road

ఒక్క సారి రోడ్డు పై వెళ్తున్న వాహనం నుండి డబ్బు నోట్ల కట్టలు గాలిలో ఎగిరి పడుతుంటే, అక్కడ ప్రజలందరూ ఎలా స్పందిస్తారు... వెంటనే అందరూ వెళ్లి ఆ నోట్లను అందుకోరూ.... సరిగ్గా ఇలాంటి సంఘటనే హాంకాంగ్ లో జరిగింది.. రోడ్డుపై వెళ్తున్న ఎదో వాహనం నుండి ఒక్కసారిగా... డబ్బు కట్టలు నోట్లు గాల్లోకి ఎగిరి పడ్డాయి..... ఒక్కసారిగా అక్కడ నోట్ల వర్షం కురిసింది. ప్రజలంతా షాపింగ్ హడావుడి, క్రిస్మస్ హడావుడిలో ఉన్న తరుణంలో హాంకాంగ్ ముఖ్యవీదులలో ఒకటైన గ్లైస్ స్టార్ రోడ్డులో నోట్లు కుప్పలు, కుప్పలుగా పడ్డాయి.దానితో ప్రజలంతా ఒక్కసారిగా ఆ నోట్లను ఏరుకుని వెళ్లిపోవడానికి ప‌్రయత్నించారు.

ఈలోగా పోలీసులు వచ్చి హడావుడిగా ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు.సుమారు కోటిన్నర హాంగ్ కాంగ్ డాలర్లు రోడ్డుపై పడగా, సుమారు ఏభై లక్షల డాలర్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారట. ఇంతకీ దీనికి కారణం ఏమిటంటే డబ్బును రవాణా చేస్తున్న వాహనం తలుపు సరిగా పనిచేయకపోవడంతో అది ఊడిపోయి డబ్బంతా వెదజల్లినట్లు అయిందట.దాంతో నోట్లు వర్షంలా పడడంతో జనం సేకరించుకుని వెళ్లారు. కాని ఇప్పుడు ఆ నోట్లను ఖర్చుచేస్తే కుదరదని,శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దాతో ప్రజలు తిరిగి ఆ నోట్లను పోలీసులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hong kong  money rain incident  hong kong police  

Other Articles