China aima maternity hospital man pregnancy pains labor pains center

Aima Maternity Hospital man pregnancy center, Aima Maternity Hospital latest, men pregnancy pains center, pregnancy pains controlling, how why pregnancy pains comes, how to avoid confirm pregnancy, pregnancy period health tips, men pregnancy updates, latest news updates

china Aima Maternity Hospital man pregnancy pains labor pains center : Aima Maternity Hospital in china giving an experience to man about pregnancy pains with artificial shocks. demand increases from men for for Aima Maternity Hospital labor pains center

మగాడికి ప్రసవ వేదన.. ఆడవారికి ఆనందం

Posted: 12/26/2014 07:56 AM IST
China aima maternity hospital man pregnancy pains labor pains center

మనిషి తలుచుకుంటే సృష్టినే మార్చగల శక్తి సామర్ద్యుడు అనే విషయం చాలాసార్లు నిరూపితమైంది. ఆడవారికి పురిటినొప్పులు, ప్రసవం అనేది సృష్టి ధర్మం. కాని గతంలో మగవారి కడుపున పిల్లలు పుట్టినఘటనలు కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ జరిగాయి. తాజాగా మగాళ్లకు పురిటినొప్పుల బాధను పంచుతోంది చైనాలోని ఆస్పత్రి. హాంగ్జౌ పట్టణంలో ఉన్న ఎయిమా ప్రసూతి ఆస్పత్రి, ఆడవారికి గర్బం సమయంలో వచ్చే పురిటి నొప్పుల బాధ మగవారికి తెలియాలని సంకల్పించింది.

‘పెయిన్ ఎక్స్ పీరియన్స్ క్యాంపు’ పేరుతో ఓ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందుకోసం పేర్లు రిజిస్టర్ చేసుకునే మగవారికి, కడుపుపై ప్రత్యేకమైన ప్యాడ్స్ ఉంచుతారు. వాటి ద్వారా ఎలక్ట్రిక్ వేవ్స్ పంపి షాక్స్ ఇస్తారు. వీటి వల్ల ప్రసవం సమయంలో ఆడవారు భరించే నొప్పులను మగవారు స్వయంగా తెలుసుకుంటున్నారు. నొప్పి తీవ్రతను బట్టి షాకులు 1 గ్రేడ్ నుంచి 10 గ్రేడుల వరకు ఉన్నాయి. బాధను భరించి షాక్ పెట్టించుకున్న మగవారు.., మీరు ఇంత బాధ భరిస్తారా అంటూ తమ భార్యలను మెచ్చుకుంటున్నారట. అంతేకాదు ఈ కేంద్రానికి మగాళ్ళ నుంచి భారీ డిమాండ్ వస్తోందట. అంతేకాదు తమ భర్తలు నొప్పులు పడుతుంటే పక్కనే కూర్చుని భార్యలు పకపకా నవ్వుతున్నారట.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : men pregnancy pains  Aima Maternity Hospital  funny weird news  

Other Articles