Bjp open to alliance with any anti congress party

BJP alliance with PDP, BJP PDP alliance in JK, bjp pdp form government, bjp pdp form government in JK, voters throw hung verdict, voters throw hung verdict in JK, BJp alliance with NC, bjp nc alliance in JK, bjp nc form government, bjp nc form gevernmemt in JK, congress secular stand, pdp decision pending, pdp not yet decided, Assembly Elections, Alliance, Ghulam Nabi Azad, Government, Secular Force, Communal Force

BJP open to alliance with any anti congress party in forming government in jammu and kashmir.

ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కాంగ్రెసేతర పార్టీలతో జతకడతాం

Posted: 12/23/2014 09:23 PM IST
Bjp open to alliance with any anti congress party

జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వెల్లడించారు. పొత్తులకు అన్ని దారులు తెరిచే ఉన్నాయన్నారు. కాంగ్రెసేతర పార్టీలతో జతకట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి బయట నుంచి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపి గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.


రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బీజేపికి పార్టీని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మద్దతు తెలిపారన్నారు. ప్రజల మద్దతుతో మంచి ప్రభుత్వాన్ని అందించేందుకు తాము ఎవరికైనా సహకరిస్తామని చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇటీవల వచ్చిన వరదల సమయంలో తక్షణం పర్యటించి.. ప్రజలకు ఆదుకునేందుకు చేపట్టిన చర్యలు కూడా బీజేపి పట్ల ఆదరణ పెరగడానికి దోహదపడ్డాయన్నారు. దీంతో పాటు ప్రధాని దీపావళి పండగను జమ్మూ ప్రజలతో కలసి జరుపుకోవడం కూడా తమ పార్టీకి కలసి వచ్చిందన్నారు25 స్థానాలు సాధించి బీజేపి కీలకస్థానంలో ఉందని అమిత్‌షా వెల్లడించారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir  assembly elections  alliance  PDP  NC  BJP  Amit shah  

Other Articles