January 1 holiday telangana christamas no holiday modi government

january 1 holiday telangana, kcr on christians, telangana government on christian bhavan, telangana government on christians, narendra modi on christmas holiday, christians on modi government, christmas holiday issue, latest news updates

january 1 holiday telangana christmas no holiday modi government : telangana government takes a decission to give holiday on january 1 on behalf of new year while central government revokes holiday of christmas

మోడి పీకేస్తుంటే కేసీఆర్ కొత్తగా ఇస్తున్నారు

Posted: 12/20/2014 08:00 AM IST
January 1 holiday telangana christamas no holiday modi government

కేసీఆర్ రూటే సపరేటు.., సారుకు నచ్చిందంటే చాలు ఎంత సాహస నిర్ణయమైనా తీసుకుంటారు. ఉద్యమంలో ఉండగా ప్రధానినే ఇష్టం వచ్చినట్లు తిట్టిన డేరింగ్ పర్సన్.., సీఎం అయినా వైఖరి మానుకోవటం లేదు. హైదరాబాద్ లో ఖాళీ సమయం దొరికితే కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయాలు, కామెంట్లు ఉంటాయి. ఢిల్లీకి వెళ్ళగానే మోడికి పుష్పగుచ్చాలు ఇస్తూ.. ఎక్కడి లెక్కలు అక్కడే అని తేలుస్తున్నారు. గతంలో కూడా కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్.., మరోసారి మోడి సర్కారుతో ఢీ: అంటే ఢీ: అనేందుకు సిద్దమవుతున్నారు.

రెండ్రోజుల క్రితం క్రిస్టియన్ల సభలో పాల్గొన్న సీఎం.., ప్రభువు బిడ్డలకు వరాలు కురిపించారు. శాంతాక్లాజ్ మాదిరిగా ఊహించని బహుమతులు ప్రకటించారు. హైదరాబాద్ లో క్రైస్తవ భవన్ నిర్మిస్తామన్నారు. వచ్చేఏడాది అందులోనే పవిత్ర ప్రార్థనలు జరుగుతాయని చెప్పారు. ఇక ఉత్సాహంతో జనవరి 1న అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన సంవత్సరంను అధికారిక సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు సెలవు దినంగా ఉన్న ‘క్రిస్టమస్’ను పనిదినంగా కేంద్రం మారుస్తుంటే.., ఇన్నాళ్లుగా లేని సెలవును కొత్తగా ప్రకటించి మోడికి పరోక్షంగా సీఎం సవాల్ విసిరారు. బహుశా మర్చిపోయారేమో క్రిస్టమస్ కు రెండ్రోజులు సెలవు ఇస్తానన్నమాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : january 1 holiday  new year celebrations  telangana latest updates  

Other Articles