Bulandshahr dm lashing out at junior staff for corrupt activities

Bulandshahr District Magistrate, video of Bulandshahr District Magistrate, Bulandshahr DM video viral, Bulandshahr DM video viral on social media, Bulandshahr DM lashes out on municipal officials, Bulandshahr DM lashes out for corrupt activities, DM action against goverment officers, poor quality road construction. corruption activities

The video of Bulandshahr District Magistrate taking strict action against municipal officers and junior engineers for not taking their work seriously has gone viral on social media.

ITEMVIDEOS: సోషల్ మీడియాలో హల్ చల్.. బలంద్షహర్ జిల్లా న్యాయమూర్తి వీడియో..

Posted: 12/18/2014 05:03 PM IST
Bulandshahr dm lashing out at junior staff for corrupt activities

అవినీతి అక్రమాలకు అలవాడు పడిన అధికారులపై ఏకంగా న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా వున్న ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్షహర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఓ రోడ్డులో చోటుచేసుకుంటున్న అవినీతిపై జిల్లా న్యాయమూర్తికి పిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జిల్యా న్యాయమూర్తి చంద్రకళ నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వున్న నాసిరకమైన ఇటుకలు, ఇతర వస్తువులను అమె పరిశీలించారు. ఇంత దారుణంగా వున్న వస్తువులతో రోడ్డు నిర్మాణాన్ని ఎలా చేపడుతున్నారని అమె మండిపడ్డారు.

మున్సిఫల్ కార్యాలయంలో ప్రజలందరూ చూస్తుండగానే, బహిరంగానే అమె అధికారులపై కన్నెర్ర చెశారు. మున్సిపల్ అధికారులు, జూనియర్ ఇంజనీర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అయితే జిల్లా న్యాయమూర్తి అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది, అమె అధికారుల తీరుపై మండిపడి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అదేశాలు జారీ చేసిన వీడియో సోషల్ మీడయాలో చక్కర్లు కోడుతోంది.

న్యాయమూర్తి చంద్రకళ ఈ వ్యవహారంలో తక్షణం విచారణకు అదేశించడంపై స్థానిక ప్రజల నుంచి హర్షం వెల్లివిసిరింది. చంద్రకళ మాదిరిగా ఉన్నతాధికారులు కూడా న్యాయబద్దంగా వుండాలని, అమెలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిన్న జరగిన ఈ ఘటనపై ముఖ్యంగా బలంద్షహర్ పురపాలక సంఘం ప్రజలు మాత్రం న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇకనైనా తమ పురపాలక సంఘం పరిధిలో అభివృద్ది పనులు నాణ్యతాయుతంగా సాగుతాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bulandshahr  District Magistrate  Bulandshahr DM video viral  

Other Articles