Eenadu and sakshi fight with their writings

eenadu paper, sakshi paper, ramoji rao writtings in eenadu, ys jagan mohan reddy writings in sakshi, ramoji rao writes about ys

eenadu and sakshi fight their writings and each and every column will publish their personally

ఆ రెండు పత్రికల యవ్వారం మరీ విడ్డూరం...!!

Posted: 12/18/2014 04:02 PM IST
Eenadu and sakshi fight with their writings

'నువ్వు గొర్రెను తింటే, నేను బర్రెను తింటా' అన్నట్టు ఉంది సాక్షి, ఈనాడు పత్రికల వ్యవహారం. అవును మరీ.., ప్రజలిప్పుడు ఈ రెండు పత్రికల గురించే చర్చించుకుంటున్నారు. ఇటీవల జగన్ ఆస్తులను ఈ.డీ అటాచ్ చేసినప్పుడు అది ఒక వార్త లాగ ప్రచురించింది ఈనాడు. అంతవరకు సరే అంతా బానే ఉంది. అదొక ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారం అనుకుందాం. ఆ వార్తపై సాక్షి ప్రతిస్పందిస్తూ 'జగన్ ఆస్తుల ఈ.డీ అటాచ్ గురించి..... దానికో పెద్ద వార్త ప్రచురించిందని ఇంకే వేరే వార్తలే, లేనట్లుగా మా సంస్థలు మూసివేయబడతాయి అన్నట్లుగా ఈనాడు ప్రచురించిందని ఆరోపించింది. సాక్షి లో ఇచ్చిన ప్రకారంగా.... 'మా ఆస్తులు కేవలం ఈ.డీ అటాచ్ చేయటం అంటే వాళ్ళ ఆధీనం లోకి తీసుకోవటం కాదని కేవలం దానిలో క్రయ విక్రయాలు జరపకుండా ఉండటం మాత్రమే అని, రోజు వారి కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని కనుక ఎవరు కూడా ఈనాడు కథనానికి ఆందోళన చెందవద్దని తన పత్రికలో అచ్చేసుకుంది. ఇంతటితో మల్లి విషయం అయిపోయిందా అంటే అదీ లేదు మల్లి ఈ.డీ అన్ని ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందంటూ ఈ నాడు లో వార్త రాగానే సాక్షి దానికి మరొక సమాధానం ఇచ్చింది.

విషయం ఏంటంటే అసలు వీళ్ళు పత్రికలు పెట్టింది ప్రజలకు సమాచారం అందించటం కోసమా లేక వీరికి వీరే ప్రశ్నలకు ప్రశ్నలు.., సమాధానాలకు ప్రతి సమాధానాలు ఇచ్చుకోవటం కోసమా? అని ప్రజలు గొణుక్కుంటున్నారు..  పత్రికలు ఉన్నది ప్రజా సమస్యలను ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటటం కోసం, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం కోసం.., కానీ ఈ పత్రికలు ఒకరినొకరిపై వాగ్భాణాలు వేసుకోవటం తోనే సమయాన్ని, పత్రికలోని విలువైన స్థలాన్ని వృధా చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.  గతం లోనూ వీరు ఇలానే వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ పత్రిక ప్రశ్న వేస్తే.., ఈ పత్రిక సమాధానం ఇవ్వటం, ఈ పత్రిక ప్రశ్న వేస్తే.., ఆ పత్రిక సమాధానం ఇవ్వటం.. ఇలా... పొద్దునే ప్రశాంతంగా ప్రపంచంలో జరిగే వార్త విశేషాల తెలుసుకుందామని పత్రిక తీస్తే వీళ్ళ సొంత పైత్య వార్తల హడావుడితో వాటిని చూడలేకపోతున్నారని, వెంటనే పక్కకి తిప్పేసి చదవకుండా ఉండటమే మేలని ప్రజలు వాపోతున్నారట. ఏది ఏమైనా ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల విజ్ఞానానికి తోడ్పాడాల్సిన పత్రికలు ఇలా ఒకరినొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ పత్రికలోని విలువైన స్థలాన్ని, ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయటం సరి కాదని వార్తలను వార్తలాగ ఇస్తే సరిపోతుందని మేధావులు చర్చించుకుంటున్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan mohan reddy  sakshi paper  ramoji rao  eenadu paper  

Other Articles