Shunkoin temple in kyoto helps japan s same sex couples tie the knot

Shunkoin Buddhist temple in Japan, Buddhist Shunkoin temple of Japan, Same-Sex Couples Tie Knot in Shunkoin Temple, Same-Sex Couples wedding ceremonies, gay marriage at Shunkoin Temple, gay marriage is illegal in japan

A Buddhist temple in Japan is offering LGBT couples a place to have symbolic wedding ceremonies, even though gay marriage is still illegal in the country.

ఆ ఆలయంలో స్వలింగ సంపర్కులకు కళ్యాణాలు..

Posted: 12/16/2014 06:30 PM IST
Shunkoin temple in kyoto helps japan s same sex couples tie the knot

సభ్య సమాజాం చీదరింపులు, అవమానాలు అన్ని భరించి తమది మరో ప్రపంచం అంటూ విహరిస్తున్న వారికి ఎట్టకేలకు ఓ ఫుణ్యస్థలం లభించింది. ఎన్నాళ్లుగానో సహజీవనానికి అలవాడు పడినా.. సంప్రదాయ బద్దంగా ఒక్కటవ్వాలన్న వారి కాంక్ష ఎక్కడా తీరడం లేదు. ఆలయాల్లో శాస్త్రబద్దం కాని వివాహాలను చేయమని ఖరాఖండిగా చెబుతున్నారు. మసీదుల్లో, చర్చుల్లో కూడా వీరి పెళ్లికి అనుమతి లభించలేదు. గురద్వారాల వైపు వీరు కన్నెత్తి చూసే సాహసం కూడా  చేయడం లేదు. వారి వద్ద ఆయుధాలు వుండటమే కారణమా లేక మరేదైనా అన్నది తెలియదు కానీ.. అటువైసు అసలు చూడటమే లేదు. అయితే ఇక ఇప్పుడు అలాంటి అవసరం కూడా లేదంటున్నారు వాళ్లు.

వాళ్లు అంటూ సంబోధిస్తున్నారే కాని ఎవరు వారు..? వారి పెళ్లిళ్లకు ఎందుకు పుణ్యస్థలాలు దోరకడం లేదు అనేదేగా మీ సందేహం. వాళ్లు అంటే స్వలింగ సంపర్కులు. వాళ్లు ఇన్నాళ్లు కలసి సహజీవనం సాగిస్తున్నా.. సంప్రదాయ బద్దంగా మూడుముళ్లు వేసుకుని ఒక్కటి కావాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వారికి ఓ చిరునామా దోరికింది. జపాన్ లోని క్యోటో పట్టణంలోని షున్కియోన్  ఆలయం వారిని ఒక్కటిగా చేసేందుకు అనుమతిస్తున్నారు. జపాన్ దేశ సరిహద్దులోని స్వలింగ సంపర్కుల వివాహాలకు ఆలయ అధికారులు అనుమతిని ఇస్తున్నారు. అయితే వీరికి వధువరులకు ఇచ్చిన చట్టబద్దమైన హక్కులను వారు కల్పించడం లేదు. స్వలింగ సంపర్కుల విషయంలో ప్రభుత్వం ఆంక్షలను విధించినా.. ఆలయ అధికారులు ఉపప్రధానార్చకులు తకఫఉమీ కవాకమి మాత్రం వివాహాలు జరిపినట్లు నిర్థారించారు. 2010 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు జంటలు సంప్రదాయ బద్దంగా మూడు ముళ్లు బంధంతో ఒక్కటయ్యాయని చెబుతున్నారు.

అయితే ఈ ఆలయంలో స్వలింగ సంపర్కులకు మాత్రమే వివాహాలు జరపడం లేదని, ఎవరైనా వచ్చి తమకు పెళ్లి చేయమంటే ఆచారాలు, లింగభేదాలు లేకుండా వచ్చినా తాము వారికి వివాహాలు జరుపుతు్నామని చెబుతున్నారు. జపాన్ రాజ్యాంగం ప్రకారం ఎవరేని ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహానతో బార్యభర్తల తరహాలో సమాన హక్కులను కల్పించాలని కోరితే వారికి మాత్రమే వివాహం చేస్తున్నామని చెప్పారు. అయితే స్వలింగ సంపర్కం చేయడం జపాన్ లో కూడా నేరంగా పరిగణిస్తారు. అయితే ఇప్సోస్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 24 శాతం మంది జపనీయులు మాత్రమే దీనికి సమ్మతిస్తుండగా, మిగిలిన వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరిమితమవుతుంది. అయితే జపాన్ వాసుల్లోని చాలా మందికి స్వలింగ సంసర్కం గురించి తెలియదు. వారిలో అధిక శాతం మంది ఇది ఎక్కడే విదేశాలకు మాత్రమే పరిమితమైన అంశంగా వారు పేర్కోంటున్నారు.

కాగా స్వలింగ సంపర్కులకు వివాహాలను జరపడంతో షున్కియోన్ ఆలయ ఆవిర్భవంతో ముడిపడిన సమస్యగా మారింది. షున్కియోన్ ఆలయం అతి పురాతనమైనది. 1590 సంవత్సరానికి చెందిన మహారాజు కిన్ సుఖే హోర్యో యుద్దంలో వీరమరణం పోందడంతో ఆయన జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించారు, ఈ ఆలయంలో జెన్ ఏకాగ్రత టెక్నిక్స్ ను ఆంగ్ల పర్యాటకులకు వివరిస్తుంటారు. ఇప్పుడు స్వలింగ సంపర్కంతో రాజ్యాంగం ప్రకారం తాము వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు ఆలయ అధికారులు. ఈ ఆలయం స్థానికంగా గల హోటల్ గ్రాన్య క్యోటో తో జతకట్టి ఒప్పందాలను చేసుకుని ఆలయంలో పెళ్లిళ్లు చేసుకున్న నూతన వధూవరులకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తుంది. ఇక ఇక్కడికి పెద్ద సంఖ్యలో స్వలింగ సంపర్కులు వచ్చి వివాహాలు చేసుకుంటారేమో వేచి చూడాలి మరి..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shunkoin Buddhist temple  Japan  gay marriage  illegal  

Other Articles