Telangana cabinets first expansion to take place today

Telangana Chief Minister K. Chandrasekhar Rao, telangana cabinet expansion, telangana , The Cabinet of Telangana

Telangana chief minister K Chandrasekhar Rao on Monday sent a list of six new ministers to be inducted into his cabinet

తెలంగాణా రాష్ట్ర మంత్రి వర్గం లో ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

Posted: 12/16/2014 11:37 AM IST
Telangana cabinets first expansion to take place today

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్  మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో వీరితో  ప్రమాణ స్వీకారం చేయించారు.  తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), అల్లోళ్ల. ఇంద్రకరణ్ రెడ్డి (ఆదిలాబాద్), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (హైదరాబాద్ ), అజ్మీరా చందూలాల్‌ (వరంగల్), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్ నగర్), అజ్మీరా చందూలాల్ (వరంగల్ ), జూపల్లి కృష్ణారావు (మహబూబ్ నగర్) మంత్రులుగా ప్రమాణం చేశారు.

దీంతో తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 18మందికి చేరింది. తెలంగాణలోని శాసన సభ్యుల సంఖ్య ప్రకారం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది ఉండవచ్చు. ఇప్పటికే సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. తాజాగా ఆరుగురికి అవకాశం కల్పించటంతో కేబినెట్ పూర్తిస్థాయికి చేరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మంత్రి పదవి ఇస్తామని ఇంకొంత మంది కి హామీ ఇచ్చినప్పటికి అప్పటికే మంత్రి వర్గం మొత్తం పూర్తి  స్థాయిలో నిండటం తో వారిని బుజ్జగించక తప్పలేదు. ఇప్పటికే అసంతృప్తులు బహిరంగంగానే తమ అక్కసు ను వెల్లదీసారు. వారందరినీ సేనియర్లు సముదాయిస్తున్నట్లు సమాచారం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles