Is riding an elephant in thailand on your buckletlist here s why it shouldn t be

Elephants, Exploitation, Wildlife Rescue, Thailand, WFFT, torturous training, elephants for logging, Tourism, Animal Activist Alliance, elephants tool sparks serious concerns, animal abuse

As much as it is fun and brings the local economy a decent income, the use of elephants as a tool for tourism sparks serious concerns for animal abuse. It has also threatened the extinction of these elephants altogether.

ITEMVIDEOS: ఏనుగు అంబారీల వెనుకదాగిన దారుణ వాస్తవాలు

Posted: 12/16/2014 07:15 AM IST
Is riding an elephant in thailand on your buckletlist here s why it shouldn t be

థాయ్ లాండ్ వెళ్తున్నారా..? అయితే అక్కడ ఏనుగు అంబారిపైనెక్కి పర్యటించనున్నారా..? ఏనుగు అంబారిపై పర్యటనకు థాయ్ లాండ్ చాలా ప్రసిద్ది చెందింది. అడవి మృగరాజులైన సింహాలనే ఎదురించిన ఏడాది ఏనుగును మనం ఇటీవలే చూశాం, కాని అంతకంటే క్రూరంగా ప్రవర్తించే మనిషి వికృత రూపం తెలియని గజరాజులు.. ఎంతలా తల్లడిల్లుతున్నాయో చూస్తే.. అమ్మో థాయ్ లాండ్ లో ఏనుగుల అంబారీని ఎక్కడమే.. అంటూ నిట్టూర్చక మానరు. అంటే ఏనుగు అంబారీ ఎక్కి విహరించినంత మాత్రన మీకు ఏదో నష్టం జరుగుతుందని కాదు..? మనల్ని సంతోషపెట్టడానికి అవెన్ని అవస్తులు పడుతున్నాయో తెలుసుకుంటే నిజంగా అవి మనుషులపై పగబట్టినా పర్వాలేదనిపిస్తోంది. అందులో తప్పుకూడా లేదనిపిస్తుంది.

ధాయ్ లాండ్ లో సరదాగా ఏనుగు అంబారీపై ఊరేగడం పట్ల అక్కడికి విచ్చేసే పర్యాటకులు ఇష్టపడతారు. దీంతో స్థానిక ఆర్థికానికి ఏనుగులు దోహదపడుతున్నాయని, వాటి యజమానులకు ఆదాయ వనురుగా మారుతున్నాయని సంతోషించేంత లోపు అనేక కఠిన కఠోరమైన వాస్తవాలు దీని వెనుక దాగివున్నాయి. పర్యటక రంగాని ఒక సాధనంగా ఏనుగులు దోహదపడుతున్న తరుణంలో వాటికి ఇచ్చే శిక్షణ వెనుక దారుణమైన నిజాలు కూడా ప్రపంచానికి తెలియల్సిన అవసరం వుంది. క్రూర ఏనుగులను తమ బంధీలుగా చేసుకునేందుకు గజరాజులను చిత్రహింసల పాలు చేస్తున్నారు అక్కడి మావటీలు. గోలుసులతో కట్టి కత్తిపోట్లు పొడచి వాటిని దారి తెచ్చుకుంటున్న ఘటనలు చూస్తే.. ఇంత కరుడు గట్టిన మనుషులు కూడా వుంటారా అనిపించకమానదు.

1900 శతాబ్దములో థాయ్ లాండ్ లో మూడు లక్షల అడవి ఏనుగులతో పాటు లక్ష బందీలుగా వుండే ఏనుగులు వున్నాయని అప్పటి గణంకాలు తెలుపుతున్నాయి. శతాబ్ధం దాటేలోపు వాటి సంఖ్య ఎంత గణనీయంగా తగ్గిందో తెలుసా..? ప్రస్తుతం థాయ్ లాండ్ లో కేవలం రెండు వేల క్రూర ఏనుగులతో పాటు 4 వేల బందీ ఏనుగులు మాత్రమే వున్నాయి. వీటి సంఖ్య ఇంతలా తగ్గిపోవడానికి కారణం మాత్రం కేవలం మనిషే. పర్యాటక పెరుగుదలతో పాటు వాటితో వ్యాపారాలు చేయడమే గజరాజుల సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. వాటి దంతాలతో ఎలాంటి వస్తువుల తయారీ చేయకూడదన్న నిషేదం వున్నా.. ధాయ్ లాండ్ లో మాత్రం ఉల్లంఘిస్తున్నారు. మనుషులు పెట్టే చిత్ర హింసలను భరించలేక.. అవి ఎంతలా నోచ్చుకుంటున్నాయో ఈ విడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే థాయ్ లాండ్ వెళ్లిన పర్యాటకులు నిరాశకు లోనుకాకుండా స్థానికంగా వున్న చియాంగ్ మాయిలోని ఎలిఫెంట్ నేచ్చుర్ పార్క్ కు వెళ్లిండి. ఇక్కడున్న ఏనుగులు బంధవిముక్తి కల్పించినవే. పర్యాటకులు ఇచ్చే విరాళాలపైనే ఇవి ఆధారపడి జీవిస్తున్నాయి. అంబారీ ఎక్కలేదని బాధపడినా.. మూగ జీవాలకు కూడా ప్రకృతి ఒడిని సమాపాళ్లలో పంచుకునే హక్కు వుందని, వాటికి సాయం చేసినందుకు గర్వంగా వుందని మీరు గర్విస్తారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abuse  do the right thing  elephant  Thailand  

Other Articles