Sydney siege hostages held in lindt cafe

Sydney siege, cafe in the Australian city of Sydney., sydney incident, live coverage as police surround a cafe in sydney, Australia, where people are being held hostage.

Earlier, at least three people were seen inside the Lindt cafe with their hands up against a window, and holding up a black flag with Arabic writing.

ఆస్ట్రేలియాలో తీవ్ర ఉద్రిక్తత... కొందరు ఆగంతకుల దుశ్చర్య...

Posted: 12/15/2014 11:48 AM IST
Sydney siege hostages held in lindt cafe

ఆస్ట్రేలియాలో కొందరు ఆగంతకులు సాధారణ ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఆస్ట్రేలియా లోని సిడ్ని నగరంలో ఆగతకులు కొందరు రెచ్చిపోయారు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నగరం లోని మార్టిన్ ప్లేస్ లోని ఒక కేఫ్ లో 13 మంది సాధరణ ప్రజలను నిర్భందించారు. దీనితో పోలీసులు కేఫ్ చుట్టుముట్టి నిర్బంధంలో ఉన్న వారిని విడిపించేందుకు కృషి చేస్తున్నారు. దుండగుల అదుపులో డజన్ల సంఖ్యలో వ్యక్తులు ఉన్నట్లు పోలీసుల సమాచారం.

పోలీసులు ఒపెరా హౌస్ను ఖాళీ చేయించారు. లోపల ఉన్న దుండగుల వద్ద ఉన్న జెండాల్లో అరబిక్ అక్షరాలను బట్టి వాళ్లు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని టోనీఅబాట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షిస్తున్నట్లు సమాచారం. జాతీయ భద్రతా దళాలను అత్యవసరంగా సంఘటనా స్థలానికి పంపినట్లు . మరోవైపు జాతీయ భద్రతా దళాలు అక్కడకు చేరుకుని... చుట్టుపక్కల ప్రజలను కూడా ఖాళీ చేయించారు. నిర్బంధంలో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావటమే తమ లక్ష్యమన్నారు. సిడ్ని నగరంపై ఏ విమానాలు తిరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రతా బలగాలు సిడ్ని నగరాన్ని మొత్తం తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles