Chiranjeevi vacates akbar road bungalow

chiranjeevi vacated banglow, chiranjeevi vacates delhi banglow, chiranjeevi vacates akbhar road banglow, chiranjeevi nor entered tughlak road banglow, chiru refuses to enter new quarter, Mp chiranjeevi back to hyderabad, MP chiranjeevi moves to hyderabad, chiranjeevi transports luggage to hyderabad

former union minister, rajya sabha member chiranjeevi vacated his banglow at akbar road and shifted his

ఇచ్చిన మాటకు కట్టుబడ్డ చిరంజీవి..

Posted: 12/10/2014 01:41 PM IST
Chiranjeevi vacates akbar road bungalow

కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తాను చెప్పిన మాటకు కట్టుబడ్డారు. అయితే ఈ విషయంలో ఎస్టేట్ అధికారులు మాత్రం చిరంజీవి విన్నపాన్ని తోసిపుచ్చారు. కేంద్ర మంత్రిగా చిరంజీవికి లభించిన అక్బర్ రోడ్డులోని నెంబరు .17 బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ఎస్టేట్ అధికారులు గత నెల 13న ఆయన ఇంటికి నోటీసును అతికించారు. దీంతో కాస్తా అసహనానికి గురైన చిరంజీవి తన నిబద్దతను చాటుకున్నారు. తన మంత్రివర్గ కాలం ముగియగానే తానే ఎస్టేట్ అధికారులకు లేఖ రాసి వేరే బంగ్లాను కేటాయించాల్సిందిగా కోరానని చెప్పారు.

అయితే తన విన్నపాన్ని తోసిపుచ్చిన అధికారులు తనకు బంగ్లా కేటాయించకుండా, ఉన్న పళంగా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. తనకు తుగ్లక్ రోడ్డులో కేటాయించిన భవనంలో గత మూడేళ్లుగా ఎవరు నివసించడం లేదని, అలాంటి బంగ్లాను తనకు కేటాయిస్తారా.. అని ప్రశ్నించారు. అయినా ఎస్టేట్ అధికారులు స్పందించలేదు. సుమారు నెల రోజుల ఓపిక పట్టినా.. ఎస్టేట్ అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో.. ఆయన ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేశారు. చిరంజీవి నివాసముంటున్న ఆ బంగ్లాను కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటాయించారు.

ఎస్టేట్ అధికారుల తీరుకు నోచ్చుకున్న చిరంజీవి.. తన బంగ్లాను ఖాళీ చేసి, సామానును రెండు ట్రక్కుల్లో హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. కారును మాత్రం ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఇంట్లో ఉంచారు. ఎస్టేట్ అధికారులు మాట మీరినా.. తాను మాత్రం అన్న మాట ప్రకారం బంగ్లాను ఖాళీ చేసి.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు చిరంజీవి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : chiranjeevi  akbar road bungalow  bungalow vacated  

Other Articles