Jaswant singh still in coma after four months

jashwanth singh health condition, jashwanth singh, jashwanth singh minister, jinnah ali book by jashwanth singh, bjp party, barmer constituency

the former BJP leader continues to be in coma and showing no sign of improvement in health, doctors said. ...His health condition is still the same.

ఇంకా కోమా లోనే మాజీ కేంద్ర మంత్రి

Posted: 12/09/2014 05:12 PM IST
Jaswant singh still in coma after four months

ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ లో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ నాలుగు నెలల క్రితం  తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుండి దాదాపు నాలుగు నెలలుగా కోమాలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్సకు కూడా ఆయన అంతగా స్పందించటం లేదని, ఆయన ఆరోగ్యం అలాగే ఉందని, ఏ మాత్రం కూడా మారలేదని ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను ప్రతిరోజూ వైద్యుల బృందం ప్రతిరోజూ  ఎప్పటికపుడు నిశితంగా పరిశీలిస్తూనే ఉందన్నారు. న్యూరోసర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు ఆయనను చూస్తున్నారని, జశ్వంత్ ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఆయన ప్రస్తుతం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ మీద ఆధారపడ్డారు. 76 ఏళ్ల జస్వంత్ సింగ్.. ఆగస్టు 8వ తేదీన తమ ఇంట్లో స్పృహలేని పరిస్థితిలో నేలమీద పడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.

వాజ్ పేయి హాయంలోని ఆయన క్యాబినెట్ లో పని చేసిన ఈ వృద్ధ నేత పలు మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. భా జ పా లో కీలక నాయకుడిగా ఉన్న తరుణంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. తను స్వయంగా రాసిన "జిన్నా: భారత దేశ విభజన-స్వాతంత్రం" అనే పుస్తకం లో జిన్నా అలీ ని పొగిడి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి  తీవ్ర దుమారాన్ని సృష్టించారు.   తన రాజకీయ జీవిత చరమాంకంలో.., ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో బర్మేర్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు. అసంతృప్తి తో భా జ పా నుండి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాని ఘోర పరాజయాన్ని చవి చూసారు.  భా జ పా నుండి బయటకి వచ్చినప్పుడు పార్టీ ఆరు సంవత్సరాల బహిష్కరణ వేటు వేసింది. ఆ సమయం నుండి రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉంటూ వచ్చారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jashwanth singh  jashwanth singh health condition  bjp party  barmare  

Other Articles