Ysr congress party leader joins bjp

Ap BJP chief Hari Babu, Visakhpatnam MP Haribabu, Vishaka Ycp former president venkat rao, Visakha North legislator Vishnu, one crore Joined AP BJP, bJP membership in full swing,

Former district president of YSR Congress Party, Chokkakula Venkata Rao alongwith his supporters on Saturday joined the BJP here in the presence of State BJP chief K Hari Babu.

రుణమాఫీ మహాధర్నా చేసిన చోట వైసీపీకి ఎదురుదెబ్బ

Posted: 12/06/2014 08:52 PM IST
Ysr congress party leader joins bjp

రైతుల రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్దని సవాల్ చేస్తూ.. విధాన ప్రకటన ద్వారా రైతులకు అన్యాయం చేస్తున్నారని అక్షేపిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ ధర్నా చేసిన విశాఖ జిల్లాలోనే ఆయన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ పార్టీకి చెందిన విశాఖ జిల్లా ముఖ్యనేత, విశాఖపట్నం జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చోక్కాకుల వెంకట్రావు బీజేపీ పార్టీలో చేరారు. విశాఖలో బీజేపి నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ఆయన విశాఖ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో బీజేపిలో చేరారు.

విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి.. ఓటమి పాలైన ఆయన ఇవాళ తన అనుచరులతో కలసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వెంకట్రావును సాధరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వం వున్న పార్టీగా భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని చెప్పారు. బీజేపి సభ్యత్వం ఇప్పుడు అన్ని రాష్ట్రాలల్లో శరవేగంగా సాగుతుందని, త్వరలోనే అతిపెద్ద సభ్యతం కలిగిన పార్టీగా రికార్డు సృష్టిస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో తమ సభ్యత నమోదు కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నుండి తమకు మద్దతు లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుంచి కోటి మందికి పైగా సభ్యత్వం కోసం తమ పేర్లను నమోదు చేయించుకున్నారని హరిబాబు చెప్పారు. వెంకట్రావు బీజేపిలో చేరడంతో విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి.విష్ణు కుమార్ రాజు అన్నారు. వెంకట్రాము చేరికను తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSR Congress Party  Andhra Pradesh  Bharatiya Janata Party  

Other Articles