Traffic offenders dodging fines may land in court

Hyderabad Traffic offenders, offenders dodging fines, offenders land in court, Regional Transport Authority, e-challans, violating traffic rules, hyderabad traffic police, Traffic offenders, e challans

If there is any pending traffic e-challan against you, pay up fast lest you may have to appear in court.

నిఘానేత్రాలే..న్యాయస్థానం వరకు లాగుతాయ్ జాగ్రత్తా..!

Posted: 12/05/2014 06:02 PM IST
Traffic offenders dodging fines may land in court

రయ్ మంటూ వాయు వేగంతో వెళ్తున్నారా.. రాష్ డ్రావింగ్ చేస్తున్నారా..? ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జంప్ చేశారా. మిమ్మల్ని ఎవరు కనిపెట్టరని హ్యాపీగా రిల్సాక్ అవుతున్నారా..? కానీ హైదరాబాద్ జంట కమీషనరేట్ల పరిధిలో వున్న అనేక సీసీ కెమెరాలు మీ పై కన్ను వేశాయన్నది మర్చిపోకండి. మీ ప్రతీ చర్యలను ఆ డేగ కళ్లు గమనిస్తుంటాయన్నది గుర్తుంచుకోండి. అయితే ఇప్పటికే ఇలాంటి చర్యలు ఏమైనా చేసి వుంటే తక్షణం డబ్బులు సర్థుకుని చెల్లింపులు చేయండి. లేదంటే అపరాద రుసుముతో పోయేదాన్ని మీరు న్యాయస్థానం వరకు తెచ్చుకున్న వారవుతారు.

జరిమానాలు చెల్లించకుండా తిరుగుతున్న ఉల్లంఘనుల ఆట కట్టించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రయోగం చేయనున్నారు. ఐదు కన్నా ఎక్కువ చలానాలు అపరిష్కృతంగా ఉండి.. పదిహేను రోజుల్లోపు చెల్లించకపోతే న్యాయస్థానంలో అభియోగపత్రం (ఛార్జిషీటు) దాఖలు చేయనున్నారు. తాగి వాహనం నడుపుతూ (డ్రంకెన్ డ్రైవ్) పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్న తరహాలో జరిమానాలు చెల్లించని వారిపైనా చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించనున్నారు. యాభైకిపైగా చలానాలను కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిని శిక్షించాల్సిందిగా కోరనున్నారు.

మోటార్ వాహన చట్టంలో నిబంధనలున్నా.,. ఇప్పటి వరకూ జంటపోలీసు కమిషనరేట్లలో ఎవరిపైనా అభియోగపత్రం దాఖలు చేయలేదు. నాలుగేళ్ల నుంచి 40 లక్షలకుపైగా ఈ-చలానాలు చెల్లింపుల్లేక మూలుగుతున్నాయి. వీటిని వసూలు చేస్తే రూ.50 కోట్ల వరకూ ప్రభుత్వ ఖజానాకు జమకానున్నాయి. అపరిష్కృత చలానాల వసూళ్లు, ఛార్జిషీట్లపై ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు ప్రాంతాలవారీగా బృందాలను ఏర్పాటు చేశారు. ఐదు.. అంతకన్నా ఎక్కువగా ఈ-చలానాలు పేరుకుపోయినవారిని ట్రాఫిక్ పోలీసులు కలుస్తూ జరిమానాలు చెల్లించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad traffic police  Traffic offenders  e challans  

Other Articles