Pm narendra modi statement in rajya sabha on niranjan jyoti controversial remarks as opposition demand continues for resignation

Rajya Sabha, Prime Minister, Narendra Modi, Sadhvi Niranjan Jyoti's controversial remarks, CPI (M), sitaram yechuri, Janata Dal United sharad yadav

PM Narendra Modi statement in rajya sabha on niranjan jyoti controversial remarks as opposition demand continues for resignation

సాధ్వీ వ్యాఖ్యలపై ప్రధాని ప్రకటన, వినిపించుకోని విపక్షాలు

Posted: 12/04/2014 06:09 PM IST
Pm narendra modi statement in rajya sabha on niranjan jyoti controversial remarks as opposition demand continues for resignation

కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. మంత్రి వ్యాఖ్యలు పార్లమెంటు సభ్యులందరకీ గుణపాఠంగా చెప్పుకోచ్చారు. సభ్యులు మాట్లాడే భాష విషయంలో ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని సూచించారు. అయితే తాన వ్యాఖ్యాలపై ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో నిరంజన్ జ్యోతి క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆమె చెప్పిన క్షమాపణను సభ్యులు ఆమోదించాలని కోరారు. మంత్రి వివాదస్పద వ్యాఖ్యలను అప్పుడే తాను ఖండించానని చెప్పారు.

ప్రధాని ప్రకటన తర్వాత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... సభ సజావుగా సాగేందుకు సహరించాలని విపక్షాలను కోరారు. గత మూడు రోజులుగా సభా కార్యక్రమాలు జరగడం లేదని, ప్రధాని ప్రకటనను పరిగణనలోకి తీసుకుని విపక్ష సభ్యులు సభకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాలు మాత్రం ప్రధాని మోడీ ప్రకటనతో పాటు, వెంకయ్యనాయుడు ప్రకటనను పట్టించుకోలేదు. ప్రధాని ప్రకటన మంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతిని సమర్థించినట్లుగా వున్నాయని ఆరోపించాయి. కేంద్రమంత్రి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.

రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడి ఇప్పుడు క్షమాపణ చెబితే సరిపోతుందా అని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ప్రశ్నించారు. రాజ్యాంగంపై విశ్వాసంలేని వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని నిలదీశారు. క్షమాపణ చెప్పారంటే తప్పు చేసినట్టేనని జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అన్నారు. తప్పుచేసిన మంత్రిని క్షమాపణతో సరిపెడితే ఎలా అని ప్రశ్నించారు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినా విపక్షాలు శాంతించలేదు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై వరుసగా మూడోరోజు విపక్షాలు సభను అడ్డుకోవడంతో రాజ్యసభ స్తంభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles