Man finds dead mouse in saus sandwich

mouse in sandwich, mouse in sandwich sause, sandwich making, chicken and mutton sandwich making, horror facts of food making process, food preparing precautions, sandwich burger pizza making, road side food making process, bakery food making secrets, danger secrets in bakery food making, russia latest news updates

man finds dead mouse in saus sandwich : Russian Anatol Voronkov, 28, bought the food from a shop while eating he found that inside sandwich dead mouse is pakced

పిజ్జా, శాండ్ విచ్ తింటారా.. అయితే ఇది చదవండి

Posted: 12/03/2014 12:15 AM IST
Man finds dead mouse in saus sandwich

మారిన భోజన పద్దతులతో మన మెనూలో చాలా మార్పులు వచ్చేశాయి. అన్నం స్థానంను బన్ను ఆక్రమిస్తే.., బిర్యాని ప్లేసును బర్గర్ రీప్లేస్ చేస్తోంది. ఇక సమోసాను శాండ్ విచ్ ఘోరంగా మోసం చేస్తోంది. నోరూరించే ఈ విదేశీ వంటకాలకు మన దేశంలో యమా గిరాకి ఉంటోంది. అందుకే ప్రముఖ సంస్థలతో పాటు లోకల్ బేకరీలు కూడా వీటిని తయారు చేస్తున్నాయి. జంకుఫుడ్ చాలా డేంజర్ అని చెప్తున్నా వినకుండా అంతా వీటినే ఏరికోరి మరీ తింటున్నారు. అయితే మీరు కోరుకున్న ఫుడ్ ఎలా చేస్తారనే విషయం పక్కనబెడితే.., వాటి తయారీలో ఎంతవరకు జాగ్రత్తలు పాటిస్తారనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా ఘటనే ఇందుకు ఉత్తమ ఉదాహరణ.

రష్యాకు చెందిన అనాటొల్ వోరాన్కోవ్ ఓ ప్రముఖ షాప్ నుంచి శాండ్ విచ్ తెచ్చుకున్నాడట. పాపం బిడ్డ ఎంత ఆకలిగా ఉన్నాడో.., ఇంటికి రాగానే చేతులు కూడా కడుక్కోకుండా పొట్లం విప్పేసి బ్రెడ్డు ఫుడ్డు నోట్లో పెట్టేసుకున్నాడు. అయితే ఎన్నడూ లేనట్లుగా నాలుకకు కొత్త టేస్ట్ తగలటంతో పాటు కొత్తగా కూడా కన్పించింది. ఏదో కారమో.., మిరియాలో కాస్త ఎక్కువ మాడి ఉంటాయిలే అనుకుని మరోసారి కొరికాడు. ఈ సారి టేస్ట్ ఇంకాస్త మారటంతో పాటు, కాస్త డిఫరెంట్ గా అన్పించింది. అసలేమిటుంది లోపల... తెరచి చూస్తే పోలా అనుకుని టేబుల్ దగ్గరకు చేరి ఓ కుర్చీపై కూర్చుని ప్లేట్లో శాండ్ విచ్ పెట్టి తెరిచి చూశాడు.

అనాటోల్ బాబుకు గుండె ఝల్లుమంది. కడుపులో కలకలం మొదలైంది. ఎందుకంటే తాను అప్పటివరకు ఆవురావురు మంటూ తిన్నది ఓ చనిపోయిన మూషికరాజం. అవునండీ.., శాండ్ విచ్ మద్యలో ఎలుక ఉందట. రెండు బ్రెడ్లకు సాస్ పూసి దాని మద్యలో ఎలుకను పెట్టి ప్యాక్ చేసిచ్చారు. అది తెలియకుండా అనాటోల్ తినేశాడు. చివరకు విషయం తెలియటంతో షాపు దగ్గరకెళ్ళి నానా రచ్చ చేశాడట. మనదగ్గర బొద్దింకలు, ఈగలు, దోమలు, చివరకు బల్లులు వస్తాయని తెలుసు. కాని ఇలా ఎలుక వస్తే ఇంకేమైనా ఉందా... సో తినేముందు ఓ సారి జాగ్రత్తగా చూడండి. లోపలేముందో తెలియకుండా లాగించేశారో.., మీ లోపలికెళ్ళాక దాంట్లోని లోపాలు బయటపడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : russia  sandwich  mouse  latest news  

Other Articles