Talibans using birds as suicide bombers

birds suicide bombers, talibans trains birds suicide bombers, birds in afgan suicide bombers, taliban training, taliban terrorists recruitment, terrorist training, afganistan terrorist attacks, terrorist attacks in india, world terrorism problems, latest news updates

talibans using birds as suicide bombers : Taliban using such a strategy and the Afghan police reportedly shot dead a bird which had been equipped.

కొత్తగా పిట్ట బాంబులొస్తున్నాయట... జాగ్రత్త !

Posted: 12/01/2014 04:59 PM IST
Talibans using birds as suicide bombers

తమ సిద్ధాంతాలు, రాద్దాంతాలతో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులు, ప్రపంచాన్ని నాశనం చేసేందుకు రోజుకో కొత్త వ్యూహం రచిస్తున్నారు. టెక్నాలజి, తెలివిని అందిపుచ్చుకుంటూ రోజుకో విధంగా దాడులు చేసేందుకు పన్నాగాలు రచిస్తున్నారు. ఆత్మాహుతి దాడులతో ప్రాణాలు పోయినా సరే ఇతరులు చావాలనే క్రూరమైన ఆలోచనను అమలు చేసే తీవ్రవాదులు తాజాగా మరో కొత్త కుట్రకు తెరతీసినట్లు ఆఫ్ఘన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్రత్యేకమైన జాతుల పక్షులను ఎంపిక చేసుకుని, వాటికి చిన్ననాటి నుంచే ఉగ్రశిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. బాంబులను మోసుకెళ్లటం, లక్ష్యాల దగ్గరకు చేరుకోవటం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు.

ఆఫ్ఘన్ పోలిసులు తుర్కమెనిస్థాన్ సరిహద్దులో ప్రత్యేక నిఘా పెట్టగా.., ఎప్పుడూ కన్పించని కొత్త పక్షి కన్పించింది. దీన్ని మరింత తీక్షణంగా పరిశీలించగా.., దానికి కొన్ని వైర్లు ఉన్నట్లు కన్పించాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం పక్షిని కాల్చి చంపింది. ఆ తర్వాత పక్షిని పరిశీలిస్తే.., దానికి పేలుడు పధార్థాలతో కూడిన సంచి, డిటోనేటర్, జీపీఎస్ ట్రాకర్ తో పాటు, కెమెరా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా ప్రత్యేక జాకెట్ కూడా వేసుకున్నట్లు గుర్తించి సైనికాధికారులు షాక్ అయ్యారు. సైనికుల దగ్గరకు వెళ్లగానే పేల్చేసేలా పక్షిని గైడ్ చేస్తున్నట్లు గుర్తించారు.

ఉగ్రవాదులు, ఆత్మాహుతి దళాలు సాధారణ ప్రజల దగ్గరకు వెళ్లి దాడులు చేయగలిగినా.. పోలిసులు, సైనికులపై సులువుగా దాడి చేయలేవు. దీంతో పక్షులను ఎంపికచేసుకుని వాటిని ఆత్మాహుతి దళాలుగా మారుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుతానికి ఈ కుట్ర ఆఫ్ఘన్ లో తాలిబన్లకే పరిమితం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉగ్ర శిక్షణను ఇతర సంస్థలు కూడా చేపడితే.. పక్షులు సమీపంలోకి వచ్చినా పారిపోవాల్సిన దుస్థితి ఏర్పడటం ఖాయం. సో కొత్త పక్షులు వస్తున్నాయంటే దగ్గరగా వెళ్లి చూడకుండా.., కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం ఉత్తమం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bird suicide bomber  taliban  afghanistan  latest news  

Other Articles