Death penalty sought for nigerian child bride

Nigeria, Child bride, marriage, Death sentence, murder, court, Sani Garba, 14-year-old daughter-in-law, Wasila Tasi’u, abandoned, matrimonial home, Unugwar Yansoro.

Death penalty sought for Nigerian child bride

14 ఏళ్ల నవవధువుకు మరణ దండన..!

Posted: 11/28/2014 11:00 PM IST
Death penalty sought for nigerian child bride

అసలే మతచాందాసవాదం, దానికి తోడు ముస్లిం మైనారిటీ దేశం, అక్కడి న్యాయశాస్త్రలు, చట్టాలను మర్చాలని చెబుతున్న ఘటన ఇది. పెళ్లైన రెండు వారాలకే హత్యా నేరంపై జైలుకెళ్లిన ఓ పద్నాలుగు ఏళ్ల నవ వధువుకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ బాధితురాలి తండ్రి, ఇసాకు తసియూ సహా మహిళా సంఘాలు న్యాయస్థానానికి విన్నవిస్తున్నాయి. నవ వధువుకు మరణ దండన కాకుండా మరేదేనా శిక్ష విధించాలని కోరుతున్నాయి. 14 ఏళ్ల చిన్నారి బాలికకు మరణ దండన సరైన శిక్ష కాదని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ చిన్నారి చేసిన తప్పేంటి..? ఎవరిని హత్య చేసింది..? మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం నేరం కాదా..?

ఉన్గ్వర్ యాన్సోరో అనేది నైజీరియాలోని ఓ మారుమూల గ్రామం. ముస్లిం పురషాధిక్య సమాజంలో ఆడవారికి, విలువలేని సమాజం అది. మైనర్, మేజర్ అనే పట్టింపులు కూడా లేవు. ఇప్పటికీ బాల్య వివాహాలు బాహాటంగానే జరుగుతున్న దేశం అది. ఈ తరహాలనే 14 ఏళ్ల వసిలా తసియూకు ఆగస్టు మాసంలో పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లికి ఆ బాలిక అంగీకరించలేదు. తనకు అప్పుడే పెళ్లి వద్దని మెండికేసింది అయినా తమ బాధ్యత నిర్వర్తించుకునే ప్రయత్నంలో బాలికకు పెళ్లి చేశారు అమె తల్లిదండ్రులు. పెళ్లై అత్తవారిట అడుగుపెట్టిన ఆ బాలికకు కాళ్ల పారాణి అరక ముందే అత్తవారిట ఆరళ్లు మొదలయ్యాయి.

అత్తామామాలను పక్కన బెడితే 35 ఏళ్ల భర్త ఉమర్ సాని నుంచి నిత్యం వేధింపులను ఎదుర్కోంది. అంతే కాదు భర్త స్నేహితుల నుంచి కూడా లైంగిక వేధింపులను ఎదుర్కోన్న ఆ బాలిక.. తన భర్త అన్న కనికరం కన్నా.. తనను వేధిస్తున్నందుకు తగిన శాస్తి చేయాలన్న ఉద్దేశ్యంతో భర్తకు ఎలుకల మందు కలిపిన అహారాన్ని పెట్టింది. భర్తతో పాటు మరో ముగ్గురు అతని స్నేహితులు బోజనం చేయగానే అనారోగ్యంతో భాధపడి మృత్యువాత పడ్డారు. దీంతో కేసు నమోదు కావడంతో.. నిందితురాలని అదుపులోకి తీసుకుని జెనివా కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన జెనివా హైకోర్టు నవవధువుకు మరణ దండన విధించే అవకాశముంది.

దీంతో నిందితురాలికి మరణ శిక్షను విధించవద్దని, బాలిక తల్లిదండ్రులతో పాటు మహిళా సంఘాలు కూడా కోర్టును అభ్యర్థిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలో నిందితురాళ్లకు శిక్షలు పడటంపై వేల మంది అమ్మాయిలు మండిపడ్డుతున్నారు. కానో రాష్ట్ర ఉప గవర్నర్ కు లేఖల ద్వరా నవ వధువుకు శిక్షను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇస్లాం చట్టాలను మర్చాల్సిన అవసరముందని అభ్యర్థిస్తున్నారు. సనాతన సంప్రదాయాలతో బాలికలను అంగడి వస్తువులుగా మారుస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును జెనీవా హైకోర్టు డిసెంబర్ 22కు వాయిదా వేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles