Hisar operation to arrest godman rampal cost over rs 26 crores

Barwala, Godman, Haryana, Haryana DGP, Hisar, India, NewsTracker, Punjab and Haryana High Court, Sant Rampal, Satlok ashram, SN Vashisht

Hisar operation to arrest 'godman' Rampal cost over Rs 26 crores

ఆ బాబాను పట్టుకోవడానికి రూ. 26 కోట్ల రూపాయలు ఖర్చైంది..

Posted: 11/28/2014 03:20 PM IST
Hisar operation to arrest godman rampal cost over rs 26 crores

వివాదాస్పద గురూజీ బాబా రాంపాల్ ను పట్టుకునేందుకు పోలీసులు సాగించిన ఆపరేషన్ కు 26 కోట్ల రూపాయాల పైచిలుకు వెచ్చించారు. హర్యానాలోని హస్సార్ పట్టణానికి చేరువలో వున్న బర్వాల గ్రామంలోని సత్ లోక్ ఆశ్రమంలో దాగివున్న బాబా రాంపాల్ ను అరెస్టు చేయడానికి, పక్షం రోజుల పాటు సాగించిన ఆపరేషన్ కు 26 కోట్ల రూపాయలను ఖర్చ చేశారని పంజాబ్ హ్యారానా హైకోర్టు వెల్లడించింది. పారా మిలటరీ బలగాల సాయంతో ఎట్టకేలకు రాంపాల్ ను పట్టుకోగలిగామని హర్యానా డీజీపీ ఎస్ ఎన్ వశిష్ట్ కోర్టుకు నివేదికను సమర్పించారు.

హర్యానా, పంజాబ్ పోలీసులతో పాటు చండీగడ్ పాలనాయంత్రాగం, కేంద్ర ప్రభుత్వం కోర్టుకు రాంపాల్ ను పట్టుకోవడంలో తమకు వ్యయమైన మొత్తాన్ని నివేదిక రూపంలో కోర్టు సమర్పించాయి. రాంపాల్ భాబాను పట్టుకునేందుకు హ్యరానా ప్రభుత్వానికి 15.43 కోట్ల రూపాయల వ్యయం కాగా, పంజాబ్ ప్రభుత్వానికి 4 కోట్ల 34 లక్షల రూపాయలు వ్యయమయ్యాయి. చండీగఢ్ పరిపాలనా యంత్రాగానికి 3 కోట్ల 28 లక్ష్లల రూపాయలు, కేంద్ర ప్రభుత్వానికి మూడు కోట్ల 55 లక్షల రూపాయల వ్యయం అయ్యిందని కోర్టుకు సమర్పించిన నివేదికలలో వెల్లడించాయి

 రాంపాల్ తన అనుచరుల సాయంతో పోలీసులను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటంతో ఐదుగురు మృతి చెందారని వారిలో నలుగురు మహిళలు కాగా, మరోకరు చిన్నారి బాలుడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరితో పాటు పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయాని తెలిపారు. దీంతో అతన్ని పట్టుకోవడానికి పోలీసు బలగాలు కూడా పెద్ద సంఖ్యలో వెళ్లాయని, అందుచేత 26 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని వారు సమర్పించిర నివేదికలో పొందుపర్చారు. రాంపాల్ ను అరెస్టు చేసే క్రమంలో సుమారు 15 వేల మంది బాబా సాయుధ అనుచరులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఆపరేషన్ సందర్భంగా సుమారు 200 మంది క్షతగాత్రులయ్యారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

ఇవాళ కట్టుదిట్టమైన భద్రత నడుమ రాంపాల్ ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ వచ్చే నెల (డిసెంబర్) 23కు వాయిదా వేసింది. డిసెంబర్ 23న బాబా రాంపాల్ తో పాటుగా ఈ కేసులో నిందులుగా వున్న రాంపాల్ ఢాకా, ఓపీ హూడాలను కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని పంజాబ్ హర్యానా హైకోర్టు పోలీసులను అదేశించింది. ఈ ఆపరేషన్ లో గాయపడిన పోలీసు వైద్య నివేదికలను కూడా తమకు పమర్పించాలని న్యాయస్థానం దిసభ్య ధర్మాసనం పోలీసులను అదేశించింది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles