Karnataka s news channel allegedly blocked

Kanataka, Telangana, TV9, Off air, chief minister, siddaramaiah, DK Shiva Kumar, minister, Patrick Raju, Telugu films, focus, Telugu speaking population. relevant, Karnataka. negative news, cable operators, major expose, karnataka government

Karnataka's news channel allegedly blocked

తెలంగాణ తర్వాత కర్ణాటకలో నిలిచిన టీవీ 9 ప్రసారాలు..

Posted: 11/25/2014 12:26 PM IST
Karnataka s news channel allegedly blocked

అవినీతి రహిత సమాజం కోసం అంటూ మంచి ట్యాగ్ లైన్ తో సమాజ హితాన్ని కోరుకుంటూ సత్యాన్వేషణ, అవినీతి, అక్రమాల అన్వేషణ సాగిస్తున్న వార్తా స్రవంతి.. టీవీ 9కి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో గత వంద రోజులకు పైగా ప్రసారాలు నిలిచిపోయిన తరువాత.. ఇటీవలే ప్రసారాలు పున: ప్రారంభమయ్యాయి. తాజాగా.. కర్ణాటకలో టీవీ 9 ప్రసారాలు నిలిచిపోయాయి. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం టీవీ 9 ప్రసారాలను నిలిపివేసిందని అరోపణలు వినబడుతున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి కర్ణాటకలో టీవీ 9 ప్రసారాలు నిలిచిపోయాయని సమాచారం.

అయితే ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని టీవీ 9 కర్ణాటక వెలుగులోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలను చేసింది. సరిగ్గా సోమవారం రాత్రి 9.30 గంటలకు వాటిని ప్రసారం చేస్తారని కూడా ప్రకటనలు వెలువరించింది. విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సరిగ్గా తొమ్మిది గంటల నుంచి టీవీ 9 ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే కర్ణాటక మంత్రి శివకుమార్ అదేశాల మేరకే ప్రసారాలు నిలిచిపోయినట్లు అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్దరామాయ్య కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా, ఈ వివాదాస్పద అంశంపై సీఎం మాట్లేడేందుకు నిరాకరించారు.

కాగా, కర్ణాటక రాష్ట్ర కేబుల్ అపరేటర్ల సంఘం అధ్యక్షడు పాట్రిక్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. టీవీ9 న్యూస్ చానల్ ప్రసారాల నిలిపివేత వెనుక ప్రభుత్వ హస్తం వుందన్న వార్తలను కొట్టిపారేశారు. టీవీ 9లో ఎక్కువగా తెలుగు సినిమాల గురించే ప్రసారాలు చేస్తున్నారని, కేవలం తెలుగు మాట్లాడే వారికే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. కర్ణాటక ప్రజలకు టీవీ 9 న్యూస్ ఛానల్ తో అవసరం లేదన్నారు. కేబుల్ అపరేటర్లపై కూడా వ్యతిరేక కథనాలను టీవీ 9 ప్రసారం చేస్తుందని అయన తన అక్కస్సును వెల్లగక్కారు.

భారత రాజ్యాంగంలో నాలుగో స్థంభంగా అభివర్ణించబడిన మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతూనే వున్నాయన్నడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలను ప్రసారం చేసే అన్ని ఛాన్సెల్స్ పై కేబుల్ అపరేటర్లను వారధిగా పెట్టుకుని ప్రభుత్వ అజమాయిషి నడిపిస్తోందన్న విమర్శలు వినబడుతున్నాయి. ప్రభుత్వ కుంభకోణాలను వెలుగులోకి రానీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తప్పులు  చేయడం.. వాటిని ఎత్తిచూపుతున్న మీడియాను కట్టడి చేయడం పాలకులకు అలవాటుగా మారుతోందన్న విమర్శలు వినబడతున్నాయి. మీడియా స్వేచ్ఛపై ప్రసంగాలు గుప్పించే నాయకులు.. ఈ తరహా నియంత్రణపై ఏలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles