Time magazine picks mangalyaan for best inventions of 2014

Mangalyaan, Mars Orbiter, Time Magazine, best inventions, technological feat, interplanetary muscles, The Supersmart Spacecraft, Nalini Nadkarni, inmates, Blue Room, Pramod Sharma, Osmo, tablet toy for kids

Time Magazine picks Mangalyaan for best inventions of 2014

‘మంగళ’యానం కాదది సూపర్ స్మార్ట్ స్పేస్ క్రాప్ట్..

Posted: 11/22/2014 01:29 PM IST
Time magazine picks mangalyaan for best inventions of 2014

భారత్ చేపట్టిన 'మంగళ్‌యాన్'ను 2014 సంవత్సరపు అత్యుత్తమ ఆవిష్కరణగా 'టైమ్' పత్రిక అభివర్ణించింది. సాంకేతిక అద్భుతంగా పేర్కొంది. అంతేకాదు అది సూపర్ స్మార్ట్ స్పేస్ క్రాప్ట్ అంటూ కోనియాడింది'' తొలి యత్నంలోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం అనేది అనితర సాధ్యమైన విషయమని.. ఇప్పటి వరకు తొలి ప్రయోగంలోనే విజయం సాధించిన తొలి దేశం భారతేనని పేర్కొంది. అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు, చైనా ఎవర్వకీ సాధ్యం కాని ప్రయోగాన్ని తొలిసారిలోనే భారత్ సాధించడం హర్షనీయమని పేర్కొంది.

సెప్టెంబరు 24న భారత్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు ధీనిని సుసాధ్యం చేశారని కోనియాడింది. ఇప్పటిదాకా ఏ ఆసియా దేశం కూడా సాధించని అద్భుతాన్ని భారత సాధించిందని' టైమ్ పేర్కొంది. 2014 సాధించిన 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో మంగళయాన్ ఒకటని పునరుద్ఘాటించింది. మరోవైపు  'టైమ్' అత్యుత్తమ అవిష్కరణల్లో మరో ఇద్దరు భారతీయుల అద్బుతావిష్కరణలకు చోటు దక్కింది. కాలేజ్ ఫ్రోఫెసర్, అటవీ పర్యావరణ శాస్త్రవేత్త నళిని నందకర్ణీ అవిష్కరించిన బ్లూ రూమ్ తో పాటు ప్రమోద్ శర్మ చిన్న పిల్లలకు కోసం అవిష్కరించిన ఓస్మోలు కూడా టైమ్ అత్యుత్తమ అవిష్కరణల్లో చోటు దక్కించుకున్నాయి.

పలు నేరాలకు పాల్పడి, జైళ్లలో మగ్గుతున్న నేరగాళ్లు 24 గంటల పాటు కేవలం తెల్లగదులను చూస్తూ గడుపుతున్నారని, దీని వల్ల వారు మానసికంగా క్షీణించి.. మనోవేధనకు లోనై.. ఆత్మహత్యల దిశగా ఆలోచనలు వెళ్తున్నాయని.. వారి కోసం బ్లూ రూమ్ అనే అవిష్కరణను చేశారు. ఖైదీలు వున్న సెల్‌లోనే ఆహ్లాదకర వాతావరణం మధ్య ఉన్నట్లనిపించే అవిష్కరణ పేరే 'బ్లూ రూమ్'(నీలివర్ణపు గది) దీంతో వారి గదిలో సుందర జలపాతాలు, అడవులు, తదితర చిత్రాలను ఓ కెమెరాతో నడిపిస్తుంటారు. దీని ద్వారా ఖైదీలకు తాము పార్కులో వున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. అటు పిల్లలను మైమరపింపచేసే 'ఓస్మో' అనే ట్యాబ్లెట్ బొమ్మను తయారు చేసిన ప్రమోద్‌శర్మల ఆవిష్కరణలనూ 'టైమ్' ప్రశంసించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles