Centre lowers upper age limit reduces number of attempts for upsc civil services aspirants

Central Government, lowers upper age limit, reduce, number of attempts, UPSC civil services aspirants, general category, Backward classes, Scheduled Caste, Scheduled Tribe

Centre lowers upper age limit, reduces number of attempts for UPSC civil services aspirants

యూపీఎస్సీ పరీక్షల వయోపరిమితి కుదింపు

Posted: 11/19/2014 03:32 PM IST
Centre lowers upper age limit reduces number of attempts for upsc civil services aspirants

ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు చేదువార్త. యూపీఏస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులలో నాణ్యత, నిపుణత కలిగిన వారికే చోటుదక్కలన్న యోచనతో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షలు రాసే అభ్యర్ధులకు గత యూపీఏ ప్రభుత్వం కల్పించిన మినహాయింపులను పున: పరిశీలించిన కేంద్రం వాటిని తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే పర్యాయాలను కూడా సమీక్షించిన కేంద్రం వాటిని సైతం కుదించింది.

ఇక తాజా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనరల్ క్యాటగిరికి చెందిన 26 ఏళ్ల లోపు అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు అర్హులను చేస్తూ నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల వరకు పరీక్షలు రాసేందుకు అర్హతను జనరల్ అభ్యర్థులకు కుదించింది. వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు సైతం 33 గా వున్న వయో పరిమితిని 28కి కుదించగా, షెడ్యూల్డు కులాలు, తెగల అభ్యర్థులకు 35 నుంచి 29కి కుదించింది. దీంతో పాటు అభ్యర్థులు పరీక్షలు రాసే పర్యాయాలను కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

జనరల్ క్యాటగిరికీ చెందిన అభ్యర్థులు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే పరీక్షలు రాసేందుకు అర్హులని చెప్పిన ప్రభుత్వం, బీసీలకు ఐదుసార్లు, ఎస్సీ, ఎస్టీలకు ఆరు పర్యాయాలు పరీక్షలు వేసే అవకాశాన్ని మాత్రమే కల్పించింది. అయితే ఇప్పటి వరకు తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని పర్సెనల్ అండ్ ట్రైనింగ్ విభాగం శాఖాధికారులు చెప్పారు. ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా ఇప్పటి వరకు వున్న జర్మనీ భాషను తొలగించి సంస్కృతాన్ని పెట్టాలని యోచిస్తున్నారు. దీంతో ఇది వివాదాలకు దారి తీసే అవకాశముందని పలువురు విద్యావేత్తలు భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles