Saudi husband tells his bride he wants a divorce during their wedding after seeing her face for the first time when the photographer asked them to pose for pictures

Western Saudi, Medinah, bride, groom, face to face, veil, photo, recoil, disgust, imagine, divorce, WhatsApp message, collapse, night of tears, social media, Afra

Saudi husband tells his bride he wants a divorce during their wedding after seeing her face for the first time when the photographer asked them to pose for pictures

తొలిచూపు.. ఒక్కటైన వారిని క్షణాల్లో విడదీసింది..

Posted: 11/18/2014 11:42 AM IST
Saudi husband tells his bride he wants a divorce during their wedding after seeing her face for the first time when the photographer asked them to pose for pictures

సౌదీలో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటోంది. పురుష అహంకార సమాజానికి తోడు.. అక్కడ పురుషాధిక్యతకు తొడ్పాటు నందించే చట్టాలున్న సౌదీలో అడవారిని బొమ్మలు చేసి ఆడిస్తున్నారు. వాట్సాప్ లో సమాధానం అందించలేదని ఓ ప్రబుద్దుడు భార్యకు విడాకులిచ్చిన ఘటనను స్థానిక ప్రజలు మర్చిపోకముందే.. మరో ఘణమన వరుడు పెళ్లీ పందిట్లోనే భార్యకు విడాకులిచ్చిన ఘటన పెను సంచలనం రేకెత్తిస్తోంది. పెళ్లికి ముందు తనకు కాబోయే భార్య ముఖాన్ని చూడకూడదన్న నిబంధనలు వున్న సౌదీలో.. ఆ నిబంధన ఎందుకు వుందన్న విషయాన్ని మర్చి విజ్ఙత లేకుండా పెళ్లి పందిరిని, అక్కడి అతిధుల్ని కన్నీళ్ల పర్యంతం చేశాడు.

ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. దక్షిణ సౌదీలోని మదీనా పట్టణంలోని ఓ వధువుతో ఆ వరుడికి వివాహం జరిగింది. అంతకుముందు ఎన్నడూ వధువు ముఖాన్ని చూడని వరుడు.. అమె ముఖాన్ని చూసి షాక్ కు గురయ్యాడు. అదీనూ.. ఫోటో గ్రాఫర్ ఫోటోలకు ఫోజులివ్వమని కోరడంతో అప్పటి వరకు పరదా చాటున వున్న పెళ్లి కూతురు పరాదా తీయడంతో.. వధువు ముఖాన్ని చూసి.. షాక్ అయ్యాడు వరుడు. నేను ఊహించుకున్నట్లు నీవు లేవు.. క్షమించు.. నీకు విడాకులు ఇస్తున్నాను అని పెళ్లి పందిట్లోనే చెప్పాడు. ఇలా పెళ్లి చేసుకున్నాడో లేదో.. అలా విడాకులు ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు, అతిధులు, బంధు మిత్రులు, అందరి సమక్షంలో విడాకులు ఇస్తున్నానని చెప్పాడు. ఈ మాటలు విన్న వధువు కుప్పకూలింది. తన భర్తపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెళ్లికి వచ్చిన పెద్దలు కల్పించుకుని వరుడికి సర్థిచెప్పేందుకు తీవ్రంగా యత్నించినా.. అది ఫలించలేదు. వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలితాలను ఇచ్చాయి.

క్షణాల ముందు వరకు సంబారాలు, ఆనందాలు, సంతోషాలు వెల్లివిసిరిన ఆ పందిట్లో.. ఏడుపులు, పెడబెబ్బలు వినిపించాయి. ఇంత ఖర్చు చేసి.. ఆడపిల్ల పెళ్లి చేస్తే పెళ్లి జరిగిన నిమిషాల వ్యవధిలోనే ముత్యాల పందిట్లోనే పెళ్లి పెటాకులయ్యిందని వధువు తరపు బందువులు రోదించారు. పెళ్లికి ముందు అమ్మాయి ముఖం చూస్తానని, నచ్చితేనే పెళ్లాడతానని చెప్పాల్సిన వరుడు. పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడం పట్ల వధువు తరపు బంధువులు మండిపడుతున్నారు. ఎంతోమంది కట్టుబాట్లను దాటిపెళ్లిముందే ఒకరినోకరు చూసుకుంటున్నారని, వరుడు తప్పదని అనివుంటే తాము తమ అమ్మాయిని అప్పుడే చూయించే వారని విలపించారు.

వధువు బాహ్యఅందాన్ని ప్రేమించే వరుడు.. ఆమె మనస్సును ప్రేమించి వుంటే బాగుండేదని వధువు తరపు స్నేహితురాలు అఫ్రా సోషల్ నెట్ వర్క్ ద్వారా అవేదనను వ్యక్తం చేసింది. పెళ్లి పందిట్లో వధువు కంట కన్నీరు ఒలికించిన వరుడు.. తగిన శాస్తి అనుభవిస్తాడని శాపనార్థాలు పెట్టింది. తన నిర్ణయంతో వధువు మనస్సు తీవ్రంగా గాయపడిందని పేర్కొనింది. నేటి సమాజంలో అనేక మంది యువకులు బాహ్య అందానికే ప్రాథాన్యతనిస్తున్నారని, విలువలు, కట్టుబాట్లు, వ్యక్తిత్వాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన స్నేహితురాలికి తన మనస్సును ప్రేమించే వ్యక్తి భర్తగా లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పింది. బాహ్య అందాలు అడవారికి కొలమానం కాకూడదనే పెళ్లికి ముందు వధువు ముఖాన్ని చూయించరని తెలిపింది. ఒకవేళ వరుడు పట్టుబట్టి వుండివుంటే అప్పుడే అమ్మాయిని చూయించేవారని, ఇప్పుడిలా వధువు, సహా అమె తల్లిదండ్రుల పరువు తీసేసి, వారిని నొప్పించడం.. కనీస ఇంకితజ్ఞానం మున్నవారు చేసే పనికాదని అఫ్రా పోస్ట్ చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Western Saudi  Medinah  bride  groom  veil  photo  recoil  disgust  divorce  collapse  night of tears  social media  Afra  saudi news  

Other Articles