British parliament empty after they see suspicious thing near the parliament

british parliament, british parliament evacuated, Suspicious package british parliament, british parliament photos, british parliament wikipedia in telugu, minister nick boles, minister nick boles twitter

british parliament empty after they see Suspicious thing near the parliament

పార్లమెంట్లో బాంబు కలకలం.. మంత్రి అనుచరుడే!

Posted: 11/17/2014 07:17 PM IST
British parliament empty after they see suspicious thing near the parliament

ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరుకు సిద్ధమైన నేపథ్యంలో బ్రిటన్ కు రానురాను ముప్పు మరింతగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. తీవ్రవాద దాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారంతో రెండో అత్యంత ప్రమాదకర హెచ్చరికను ఆగస్టులో బ్రిటన్ జారీచేసింది. ఇక అప్పటినుంచి బ్రిటన్ అధికారులు ప్రతిక్షణం అలర్ట్ గా వుంటున్నారు. బాంబుదడులు జరగకుండా వుండేందుకు అన్నిచోట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతసెక్యూరిటీ వున్నా కూడా... బ్రిటీష్ పార్లమెంటు ఆవరణలో అధికారులకు ఓ అనుమానాస్పద ఐప్యాడ్ బాంబు కనిపించడంతో అందరూ షాకయ్యారు. అంతే.. పార్లమెంటులో వున్న అధికారులందరూ ఒకటే పరుగులు తీశారు.

పార్లమెంటు ప్రాంగణంలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతాధికారులు రంగంలోకి దిగి ముందు జాగ్రత్తగా ఎంపీలను పార్లమెంట్ నుంచి వెలుపలకు పంపించారు. అంతేకాదు.. పార్లమెంట్ ఎదురుగా ఉన్న ఆఫీసు బిల్డింగ్, వెస్ట్ మినిస్టర్ అండర్ గ్రౌండ్ స్టేషన్ ను కూడా ఖాళీ చేయించారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతాధికారులు అణువణువు సోదా చేసిన అనంతరం అసలు విషయం బయటపడింది. అనుమానాస్పదంగా కనిపించిన ఆ వస్తువు బాంబు కాదని.. అది కేవలం ఐప్యాడ్ మాత్రమేనని నిర్ధారణకు వచ్చిన అనంతరం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఐపాడ్ మంత్రి నిక్ బోల్స్ అనుచరుడిదిగా గుర్తించారు.

మంత్రి నిక్ బోల్స్ అనుచరుడు పార్లమెంటుకు రావడం అదే మొదటిసారట! తను వస్తూ తనతోపాటు ఆ ఐప్యాడ్ ను కూడా పార్లమెంటుకు తీసుకెళ్లాడు. మరి అతను అక్కడే మరిచిపోయాడే లేక లోపలికి తీసుకెళ్లడానికి అధికారులు తిరస్కరించారో తెలియదు కానీ.. ఆ ఐప్యాడ్ ను అతను ప్రాంగణంలోనే వదిలివెళ్లాడు. అంతే! దానిని గమనించిన అధికారులు అది బాంబు అనుకుని ప్రాణభయంతో అడ్రస్ లేకుండా పరుగులు తీశారు. చివరికి కాదని తెలిసి రిలీఫ్ అయ్యారు. దీనిపై మంత్రి నిక్ బోల్స్ ట్వీట్ చేస్తూ..  ‘‘మా కుర్రాడి ఉద్యోగం పార్లమెంటులో తొలినాడే ఉద్విగ్నభరితంగా మొదలైంది. అతడి ఐపాడ్ కారణంగా పార్లమెంటు మొత్తం ఖాళీ అయింది’’ అని పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles