In andhra pradesh bjp looks like a infant says jc diwakar reddy

JC diwakar reddy, andhra pradesh, telangana, TDP, BJP, just born baby, infant, congress, PM modi

In andhra pradesh bjp looks like a infant says jc diwakar reddy

అక్కడ పహిల్వాన్ ఐనా.. ఇక్కడ మాత్రం శిశివేనట..

Posted: 11/14/2014 07:33 PM IST
In andhra pradesh bjp looks like a infant says jc diwakar reddy

దేశవ్యాప్తంగా ఇఫ్పుడు బాజేపీ అంటే ఓ కోత్త ఆశ, ఒ కొత్త ఒరవడి. ఓ మార్పుకు సంకేతం. అందులోనూ ప్రధాని నరేంద్రమోడీ అంటే దేశ యువత భలే క్రేజ్. ఆయనను అన్ని రకాల సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అందుకే ఇటవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మూడు దశాద్దాల తరువాత తొలిసారిగా దేశప్రజలందరూ కలసి మోడీకి పట్టం కట్టారు. దేశం అభివృద్దిలో తీసుకెళ్లాలంటే.. మోడీ మర్కు గుజరాత్ తరహా అభివృద్ది కావాలని కాంక్షించారు. గెలిపించారు. ప్రధాని పదవిని పట్టం కట్టారు. అంతేకాదు ప్రపంచ దేశాలకు కూడా మోడీ అంటే ఓ శక్తి. ఆయన మాటల మనిషి కాదని, చేతల మనిషని స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడే కొనియాడారంటే.. సాధారణ విషయం మాత్రం కాదు.

కానీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం మోడీ నేతత్వంలోని బీజేపి అప్పుడే పుట్టిన శిశువులాంటిదని అభిప్రాయపడ్డారు. అందుచేత ఆ పార్టీ భవిష్యత్తును అప్పుడే చెప్పడం కష్టమన్నారు. ఎప్పుడూ ఏదో ఉదాహరణలు, నిర్వచనాలతో సరిపోల్చుతూ తనదైన శైలిలో మీడియాతో ప్రసంగించే జేసీ.. కేంద్రంలో పహిల్వాన్ అయినా.. తమ రాష్ట్రంలో మాత్రం బీజేపి శిశువులాంటిదేన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన  కాంగ్రెస్ నేతలు వీహెచ్, గీతారెడ్డిలతో మాటామంతీ  నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ.. రుణమాఫీ విషయంలో బ్యాంకులు ఒత్తిడి చేయనంత వరకూ కష్టమేమీ ఉండదన్నారు. అయితే కొత్త అప్పులు ఇవ్వకపోతే మాత్రం ఏపీ రైతులు రోడ్డెక్కుతారని తెలిపారు.

తమ తదుపరి లక్ష్యం ఏపీ తమిళనాడు రాష్ట్రాలేనని ఇటీవల బీజేపి నేతలు ప్రకటించడంతో.. జేసీ ఈ వ్యాఖ్యలతో తన అభిప్రాయాని్న వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యాల అంతరార్థం  ఏంటంటే ఏపీలో బీజేపీ శిశువులాంటిదని.. ఆ పార్టీ భవిష్యత్తు అప్పుడే చెప్పలేమన్నారు. ఐదారేళ్ల వరక చంద్రబాబు సర్కారుకు ఇబ్బంది ఏమీ లేదని, బీజేపి ఎంత మేర లక్ష్యాన్ని పెట్టుకున్నా చివరి గెలుపు తమదేనని అర్థం అంతేకాదండోయ్ వెళ్తూ, వెళ్తూ ఆయన తన పూర్వ పార్టీ కాంగ్రెస్ పై మరో మాట అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలబడిందని.. ఇక ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేవలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ అంటున్నారే తప్ప కాంగ్రెస్ అని ఎవరూ చెప్పడం లేదని జేసీ దివాకర్ రెడ్డి పేర్కోన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JC diwakar reddy  andhra pradesh  telangana  TDP  BJP  just born baby  infant  congress  PM modi  

Other Articles