Chiranjeevi responds over notice to vacate guest house

chiranjeevi. congress party, chiranjeevi, official residence, estate directorate officers, PM Narendra Modi, Megastar, former Union minister, Rajya sabha, MP

Chiranjeevi Responds over Notice to Vacate Guest-house

చిరంజీవిని ఎక్కడ వుండమంటారు..? నివాసం ఇవ్వకుండా ఖాళీ చేయమంటారా..?

Posted: 11/14/2014 06:41 PM IST
Chiranjeevi responds over notice to vacate guest house

కేంద్రంలో కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కోత్త ప్రభుత్వంతోనూ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. మార్పుకు శ్రీకారం చుడతామని ప్రధాని మోడీ బాహాటంగా చెప్పినా.. అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరులోనే మార్పు తీసుకువస్తామన్న ప్రభుత్వ హయంలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిరాగానే ముందుగా గత ప్రభుత్వం నియమించిన రాష్ట్ర గవర్నర్ లను తొలగించి.. తమ ముద్ర వేసుకుంటారు. మోడీ ప్రభుత్వ హయాంలోనూ జరిగింది అదే. మరి మార్పు ఎక్కడ కనబడుతోంది.

ఈ విషయాన్ని పక్కన బెడితే.. మాజీ కేంద్ర మంత్రులకు ఒక హోదా వుంటుంది. వారికి సాధారణ ఎంపీలకు కొంత వత్యాసం చూపించాల్సిన అవసరం కూడా వుంది. కానీ అలా కాదని మాజీలు కాగానే వారి ఇమేజ్ కు డ్యామేజ్ కలిగేలా వ్యవహరిస్తానంటున్నారు అధికారులు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన వెంటనే కేంద్ర మాజీ మంత్రులందరూ మాజీలు అవుతారు. అప్పటి వరకు అనుభవించిన ప్రభుత్వ వసతులన్నింటినీ కోల్పోతారు. అయితే సాధారణ ఎంపీలకు కేంద్ర మాజీ మంత్రులకు మాత్రం కొంత వత్యాసం వుంటుంది. వారికంటూ కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది.

అయితే వీటన్నింటినీ మరచిన కేంద్ర ప్రభుత్వ అధికారులు.. ఏకంగా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఢిల్లీలోని నివాసానికి వెళ్లి తక్షణం ఖాళీ చేస్తారా..? లేక ఖాళీ చేయించమంటారా అని వ్యవహరించడం ఎంత వరకు సబబు. ఒక ప్రజాప్రతినిధిగా, కేంద్ర మాజీ మంత్రిగా ఆయనకు అధికారులు ఇచ్చే గౌరవమర్యాదలు ఇవేనా..? గెలుపోటములు సహజం, ఓడిన వారు మళ్లీ గెలవరని ఎక్కడ లేదు. అధికారం శాశ్వతం కాదు. మారుతూనే వుంటుంది. మార్పు సహజం, అనంతం ఇది తెలిసిన అధికారులు కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే వారి మాటే వింటామన్నట్లుగా వ్యవహరించడం ఏంత వరకు సమంజసం.

చిరంజీవి.. ఒక సామాన్యుడు. విద్యార్థి దశలో.. కాలేజీ దశకు చేరుకునే సరికి ఆయన నాటకాల రాయుడు. ఆ తరువాత సినిమా రంగంలో కథానాయకుడు, క్రమంగా మగధీరుడు, హిట్లర్, ఠాగూర్, స్టాలిన్ అలా అనంతుడయ్యాడు. తెలుగు వెండి తెరకు ఆరాధ్యడయ్యాడు. దక్షిణాది రాష్ట్రాల్లోని మేటి నటుల్లో అగ్రగన్యుడయ్యాడు. అందరితో కలివిడిగా వుంటూ.. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ అయ్యాడు. తన పరపతి, హోదాను మంచి వినియోగించాలని భావించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టాడు. వాటి అమలు కోసం తాను ప్రాజెజిత ప్రకటనల్లో నటించి నిధులు సమీకరించాడు. వాటిపై ఆరోపణలు రాగానే.. తన సొంత డబ్బులతో నిర్వహణ బాద్యతను చేపడుతున్నాడు. ఇప్పటికీ ఎందరికో అప్థులకు రక్తాన్ని అందించిన ఘనత ఆయన బ్లడ్ బ్యాంక్ సొంతం.

తెలుగు చిత్రసీమలోనే ఎవరూ ఇండస్ట్రీకి చెందిన చిన్నతారలకు అన్నయ్యగా మారాడు. ఎందరెందరినో అదుకున్నాడు, అవకాశాలు ఇప్పించాడు. తనతో నటించే అవకాశాన్ని కల్పించాడు. ప్రస్తుత బీజేపి నేత, సినీనటుడు శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఇచ్చిన ఓ గ్రీటింగ్.. గురించి స్వయంగా శివాజీయే చెప్పే వరకు విషయం ఎవరికీ తెలియదు. తాను ఏం చేసినా గుప్తంగానే వుండాలనుకునే వ్యక్తిత్తం చిరంజీవిది. అలాంటి ఓ మిస్టర్ ఫర్ఫెక్ట్ ను, రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా వున్న కొందరు నాయకులలో ఒకరైన చిరంజీవికి పరాభవం జరగడం.. సమంజమేనా..? ఇది తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాదా..? మరి తెలుగు ప్రభుత్వాలు ఈ విషయమై ఎందుకు మౌనంగా వున్నాయి.

తనకు ప్రత్యామ్నాయ నివాస వసతి చూపించకుండా తక్షణమే ఉంటున్న నివాస గృహాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్రమంత్రిగా తన పదవీకాలం ముగిసిన వెంటనే తనకు కొత్త నివాస గృహం కేటాయించాలని కోరుతూ సంబంధిత మంత్రిత్వ శాఖకు స్వయంగా లేఖ రాశానని చెప్పారు. అప్పట్లో స్పందించకుండా ఇటీవల ఢిల్లీలోని తుగ్లక్ లైన్‌లో ఓ నివాసగృహాన్ని కేటాయించారన్నారు. దాన్ని పరిశీలిస్తే గత మూడేళ్లుగా అందులో ఎవరూ నివాసం ఉండటం లేదని తేలిందన్నారు. తనకు అది కాకుండా మరో ప్రాంతంలో నివాసయోగ్యమైన ఇంటిని కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న నివాస గృహాన్ని ఖాళీ చేస్తే తాను ఎక్కడ ఉండాలో చెప్పాలని డిమాండు చేశారు. ఇందులో తప్పేముందో అర్థం కాలేదు. అయితే చిరంజీవిదే తప్పని.. అయన నివాసానికి వెళ్లి పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని మీడియా కథనాలు వెల్లువెత్తాయి. మరి ఆయన ఆరు మాసాల క్రితం రాసిన లేఖపై మీడియా ఎందుకు స్పందించరు.

మీడియాను పక్కన బెడితే.. అధికారులైనా చిరంజీవి లేఖపై స్పందించాలి కాదా..? మార్పు సాధ్యం అంటూన్న మోడీ సర్కార్ అయినాజజ పాత పద్దతులనే పట్టుకుని వేలాడుతున్న అధికారులను మార్చాలి. లేదా వారి అనుసరిస్తున్న పద్దతులను మార్చాలి. కేంద్ర మాజీ మంత్రుల హోదాలో చిరంజీవి ఇచ్చిన లేఖలపైనే అధికారులు స్పందించకుంటే.. ఇక సామాన్యుల లేఖపై మోడీ ప్రభుత్వం ఎలా స్పందింస్తుంది. సామాన్యులకు ప్రభుత్వ ఫలాలను ఎలా అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, పాలకులు మరోమారు పునరాలోచన చేయాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles