Target chandrababu heritage foods allegedly using oxytocin injections to stimulate milk production in cows citing kerala ban after formalin was found in its milk samples

politics, Telangana government, Telangana CM, KCR, Telangana Deputy CM. Rajaiah N. Chandrababu, kerala, Heritage Foods, formalin, Oxytocin injections

Chandrababu @ Heritage Foods, allegedly using Oxytocin injections to stimulate milk production in cows, citing Kerala ban after formalin was found in its milk samples.

టార్గెట్ చంద్రబాబు @ హెరిటేజ్.. తెలంగాణ అసెంబ్లీలో కల్తీపాల లోల్లి..

Posted: 11/13/2014 11:07 AM IST
Target chandrababu heritage foods allegedly using oxytocin injections to stimulate milk production in cows citing kerala ban after formalin was found in its milk samples

రాష్ట్ర విభజన జరిగినా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ప్రభుత్వం ఆరోఫణలను సంధించకుండా ఉండటం లేదు. ప్రాంతాల మధ్య గొడవ కాస్తా.. ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరికి దారితీసింది. అది చాలదన్నట్లు.. ఇప్పడు ప్రభుత్వాల నుంచి వ్యక్తిగత దూషణలు, కుట్రలు, పగలు, కక్షలు, కార్పన్యాలకు దారి తీస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలే.. తెలుగు వారందరూ కలసి వుండాలని ఆని ఆకాంక్షించిన ఇరు రాష్ట్రాల నేతలు.. ఇప్పడు నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై మరోకరు తలపడటం ఆందోళనకర పరిణామం అనే చెప్పాలి.

తెలంగాణలో టీడీపీ ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ ఆకర్ష్ పథకంలో భాగంగా వారిని పార్టీలో చేర్చుకోవడంతోనే అసలు సమస్య ప్రారంభమైంది. ఇదే ఆకర్ష్ పథకాన్ని సీమాంధ్రలో నడుపుతూ వైసీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్న టీడీపీకి ఇది మింగుడు పడటం లేదు. దీంతో తనకున్న ప్రాబల్యంలో కేంద్ర నుంచి తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. విద్యుత్ విషయంలో కానీ, హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించే విషయంలో కానీ, తన పట్టు సాధించుకుంది. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడం దగ్గర నుంచి ప్రారంభమైన ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ.. ఇప్పుడు తాజాగా చంద్రబాబు వ్యక్తిగత వ్యాపారమైన హెరిటేజ్ ఫుడ్స్ వద్దకు చేరింది.

చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్ పై ఆయన పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలే టార్గెట్ చేయడం గమనార్హం. నవంబర్ 7న శాసనమండలిని కుదిపేసిన ఈ అంశం మళ్లీ నిన్న శాసనసభలో రాజుకుంది. తెలంగాణకు విద్యత్ కేటాయింపులు పునర్విభజన చట్టం ప్రకారం చేయాని చంద్రబాబుపై వ్యక్తిగతంగా చర్యలకు ఉపక్రమించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోందని అప్పడే అనుమానాలు రేకెత్తాయి. అయితే సద్దుమణిగిందనుకున్న క్షణంలో మళ్లి నిన్న అసెంబ్లిలో ఈ అంశం రాజుకుంది  ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీలో హెరిటేజ్‌ అంశం దుమారం రేపింది.

వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌ కునారిల్లిపోయిందంటూ తెలంగాణ టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశంపై టీఆర్‌ఎస్‌ ధీటుగా జవాబిచ్చింది. పాలల్లో కల్తీ జరుగుతోందని టిడిపి సభ్యులు దాడి చేయగా.. ఆ కల్తీ వెనక టిడిపి నేత చంద్రబాబు నడిపిస్తున్న కంపెనీ ఉందంటూ ఎదురు దాడికి దిగింది. హెరిటేజ్‌ పాలను ఇప్పటికే కేరళ ప్రభుత్వం నిషేధించిందని.., అలాంటి పాలను తెలంగాణలో ఎలా విక్రయిస్తారంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు దాడికి దిగారు. కేరళలో హెరిటేజ్ పాలను నిషేధించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. అధికారికంగా హెరిటేజ్ పాల నాణ్యతను పరిశీలిస్తామని, తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ ద్వారా పాల భద్రత, నాణ్యత పరిశీలిస్తామని రాజయ్య తెలిపారు.

కేరళలో విక్రయాలు నిషేధించారన్నది అవాస్తవం..

మరోవైపు కేరళ రాష్ట్రంలో హెరిటేజ్‌ పాల విక్రయాలను నిషేధించారన్నట్లుగా కొందరు చేసిన ఆరోపణల్లో నిజం లేదని హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ స్పష్టం చేసింది. అక్కడ హెరిటేజ్‌ పాల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొంది. పాడి పశువుల్లో చేపు కోసం తమ కంపెనీ ‘ఆక్సిటోసిన్‌’ ఇంజక్షన్లు వాడుతోందన్న ఆరోపణలను కూడా హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ తోసిపుచ్చింది. 2012 ఆగస్ట్‌ నెలలో కేరళ ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌.. ఆ రాష్ట్రంలో పద్మనాభ పేరుతో విక్రయిస్తున్న స్టాండర్డ్‌ పాలను ఒక నెల పాటు అమ్మరాదని ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు కూడా టోన్డ్‌ పాలు, డబుల్‌ టోన్డ్‌ పాలు విక్రయించడానికి అనుమతి ఇచ్చారని పేర్కొంది. తాము ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత పద్మనాభ పాల విక్రయంపై ఇచ్చిన ఉత్తర్వులను కమిషనర్‌ ఉపసంహరించుకొన్నారని తెలిపింది.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో హెరిటేజ్‌ పాల ఉత్పత్తుల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయనింది. 1993లో ప్రారంభమైన హెరిటేజ్‌ సంస్థ ప్రస్తుతం రోజుకు పది లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించి వినియోగదారులకు విక్రయిస్తోందని చెప్పారు. సేకరణ, విక్రయాల్లో కఠినమైన నాణ్యతా ప్రమాణాలను సంస్థ పాటిస్తోందని వివరించారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని మూడు లక్షల మంది రైతుల నుంచి తాము ప్రతి రోజూ పాలను సేకరిస్తున్నాం. వీటిని ముందుగా స్థానిక చిల్లింగ్‌ కేంద్రాలకు తరలించి..అక్కడ నుంచి ఇన్సులేటెడ్‌ పాల ట్యాంకర్ల ద్వారా ప్రాసెసింగ్‌ కేంద్రాలకు తరలిస్తామని పేర్కొంది. .

ఏదిఏమైనా ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఈ ఘర్షణాత్మక వైఖరి భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితిలోకి జారుకుంటున్నారు ఇరు రాష్ట్రాల ప్రజలు. ప్రభుత్వాలు ప్రజాహితం మానేని.. కేవలం వారి కుట్రలు, అందుకు ప్రణాళికలు రచించుకుంటూ పోతే.. అందుకు అనుగూణంగా ప్రజలను సైతం రెచ్చగొట్టి.. విద్వేషాలను రెచ్చగొడితే.. ఎవరికి నష్టం. ప్రభుత్వాలకా..? ప్రజలకా..? ప్రజలను సంయమనంతో ఉండాలని చెప్పే ప్రభుత్వాలు.. వాటి వివాదాలన పక్కన బెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే.. ఒకరికోకరు సహకరించుకుని చెట్టపట్టాలేసుకుని అభివృద్ది దిశగా పయనిస్తే.. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వున్నా.. వారు మాత్రం ఒక్కటే నని ప్రపంచానికి చాటినవాళ్లమవుతాం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles