Anti hindu elements were gathering power in maharashtra warns uddhav thackeray

MIM, Shiv Sena, Uddhav Thackeray, muslims, hindutva, Owaisi brothers, 2 assembly segments, nanded Muncipal Elections

'anti-Hindu elements' were gathering power in Maharashtra warns Uddhav Thackeray

ఎంఐఎం, బీజేపి, ఎన్సీపీలను ఉతికేసిన ఉద్దవ్..

Posted: 11/11/2014 01:37 PM IST
Anti hindu elements were gathering power in maharashtra warns uddhav thackeray

మజ్లిస్ పార్టీ పైనా ...ఆ పార్టీ అధినేతలు ఒవైసీ సోదరుల పైనా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే  సంచలన వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. మజ్లిస్ పార్టీని నిషేధించాలన్న డిమాండ్ కు దేశ ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు. ఎంఐఎం పార్టీని నిషేధించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణీతి షిండే గతంలో డిమాండ్ చేశారంటోన్న ఉద్ధవ్..ప్రజలంతా ఆమె డిమాండ్ కు మద్దతు పలకాలని పిలుపు నిచ్చారు. హిందువులకు అత్యంత ప్రమాదకరమైన శక్తులు ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో తలలు పైకెత్తాయని ఉద్ధవ్ థాకరే మజ్లిస్ విజయాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఒవైసీ సోదరులిద్దరూ ఛాందస వాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ముస్లింలో మనసుల్లో ఒవైసీ సోదరులు విషబీజాలు నాటుతున్నారని ఆయన మండి పడ్డారు. మహారాష్ట్రలోని నాందెడ్ మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో ఆరంగేట్రం చేసిన మజ్లిస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రంలో బోణీ కొట్టింది. ఏకంగా రెండు స్థానాల్లో మజ్లిస్ విజయ బావుటా ఎగరేసింది. మరో 14 నియోజక వర్గాల్లో రెండు..మూడు స్థానాల్లో నిలిచి తన ఉనికి చాటుకుంది. మజ్లిస్ బలోపేతం కావడం రాజకీయంగా తమకు నష్టమేనని భావిస్తోన్న ఉద్ధవ్ థాకరే... మజ్లిస్పై కారాలూ మిరియాలూ నూరుతున్నారు.

కాగా, తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ఆయన స్పష్టం చేశారు. సేన భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపి ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపి తన పార్టీ సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, అందుకనే ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. హిందూ ఉగ్రవాదం అన్న పదాన్ని పుట్టించిన శరద్ పవార్ పార్టీ మద్దతును ఎలా స్వీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. 13 రోజుల అటల్ బీహారీ వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని అప్పట్లో పటగొట్టడానికి కారణం కూడా శరద్ పవార్ నేనంటూ ఉద్దవ్ థాక్రే నిప్పులు చెరిగారు. అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన ఎన్సీపీతో హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపి ఎలా మద్దతు తీసుకుంటుందని ప్రశ్నించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles