Eshwarappa s comments on rapes

eshwarappa, rape, latest news, karnataka

Eshwarappa’s comments on rapes : karnataka bjp leader latest comments on rapes creating political controversy in state. bjp leader eshwarapa says if cm and home minister daughters raped they will know pain of incident

సీఎం, హోంమంత్రి కూతుళ్ళను రేప్ చేస్తే....

Posted: 11/08/2014 06:36 PM IST
Eshwarappa s comments on rapes

నేతలకు నోరు జారటం అలవాటే. అలా నోరు జారి నాలుక కరుచుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఇక ఆడవారి విషయంలో అయితే, ఎవరు ఏం మాట్లాడినా వివాదం అవుతుంది. ఈ విషయం తెలిసినా.., ఆవేశంలో మాట్లాడేసి ఆ తర్వాత వివరణలు ఇచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటక బీజేపి నేత ఈశ్వరప్ప చేసిన కామెంట్లు విమర్శలకు తావిస్తున్నాయి. రేప్ లపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోందనీ.., కేవలం టీఆర్ పీ కోసమే ఇలా చేస్తోందని కన్నడ హోంమంత్రి అన్నారు.

ఈ కామెంట్ పై ఈశ్వరప్ప తీవ్రంగా స్పందించారు. నేరాలు అదుపు చేయకుండా ఎత్తి చూపించిన మీడియాను విమర్శిస్తారా అని మండిపడ్డారు. ‘‘సీఎం, హోంమంత్రి కూతుళ్లను రేప్ చేస్తే బాధ ఎలా ఉంటుందో వారికి తెలుస్తుంది’’. అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఆడవారి గురించి ఇలా ఏవిధంగా మాట్లాడుతారు అని విమర్శలు వస్తున్నాయి. సీఎం, హోంమంత్రి ఈ కామెంట్లపై సీరియస్ గా స్పందించారు. అటు బీజేపీ నేతలు కూడా ఎవరైనా ఆడకూతుళ్లే కదా, ఈశ్వరప్ప ఇలా మాట్లడి ఉండకూడదు అంటున్నారు.

చివరకు తప్పు తెలుసుకున్న ఈశ్వరప్ప తనకు మహిళలు అంటే ఎంతో గౌరవం ఉందనీ.., సీఎం, హోంమంత్రి కూతుళ్లు తనకు చెల్లెల్లతో సమానం అని చెప్పారు. పైగా తన కామెంట్లను మీడియా వక్రీకరించింది అని నెపం మీడియాపై నెట్టేసి పక్కకు తప్పుకున్నారు. ఆవేశ పడటం ఎందుకు ఆ తర్వాత ఇలా బాధపడి మీడియాను బలి చేయటం ఎందుకు చెప్పండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eshwarappa  rape  latest news  karnataka  

Other Articles