Most of indian women prefer rich husband than good in bed

indian women feelings on husband, indian women about husband, indian women behaviour mentalty, indian women attitude, money vs good heart, money important role in life, latest news, women on husbnd in bed room

most of indian women prefer rich husband than good in bed : a media organisation surveyed indian women preferences about their choice to select husband from rich or good at bed. in a survey most of indian women told that they prefer rich husband than good in bed

అమ్మాయిలు భర్త నుంచి కోరుకునేది ఇదేనా...?

Posted: 11/09/2014 01:10 AM IST
Most of indian women prefer rich husband than good in bed

పెళ్లి అంటే నూరేళ్ళ పంట. ఇద్దరు వ్యక్తులు కలకాలం కొనసాగే బంధం. పెళ్లంటే ప్రతి అమ్మాయికి ఎన్నో కలలు ఉంటాయి. వచ్చేవాడు ఇలా ఉండాలి, అలా చేయాలి..., ప్రేమగా చూసుకోవాలి, ఏది అడిగినా కాదు అనకూడదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ కలల ఆధారంగానే..., సినిమాల్లో ‘వస్తాడు నా రాజు ఈ రోజు, ‘దేవతలారా రండి మీ దీవెనలందించండి.., ‘ఆరడుగులు ఉంటాడా’ అని పాటలు ఉన్నాయి. అయితే కాలంతో పాటు అమ్మాయిల అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. ఈ తరం అమ్మాయిలు ‘ వి లవ్ బ్యాడ్ బాయ్స్’ అంటున్నారు. అంటే మంచి గుణం లేకపోయినా పర్వా లేదు కానీ బాగా డబ్బులు మాత్రం ఉండాలి అని అంటున్నారు.

ఇదే అంశంపై ఓ సంస్థ సర్వే చేసింది. ‘భారతీయ మహిళలు డబ్బున్న భర్తను కోరుకుంటారా.., లేక పడకగదిలో మంచిగా ఉండే భర్తను కోరుకుంటారా..?‘ అనే అంశంతో సర్వే చేసింది. దీనిలో మెజార్టి వర్గం డబ్బులు ఉంటే జీవితం బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అయితే ఈ యుగంలో డబ్బు తప్పనిసరి. అది లేకపోతే ఎలా.., కావాలంటే పడకగది మ్యాటర్ కు ప్రత్యామ్నయాలు చూసుకోవచ్చు అని సలహాలు ఇస్తున్నారు. డబ్బు అవసరం కావటంతో పాటు అది ఒక హోదాగా కొందరు భావించి, మనీ ఉంటే మై మ్యాన్ లేకపోతే నో మ్యాన్ అని చెప్పారు. ఈ అభిప్రాయం చెప్పినవారిలో కొందరు పడక సుఖం అంటే తప్పుగా అర్ధం చేసుకుని ఉండవచ్చు.

ఇక మరికొందరు మాత్రం డబ్బు కంటే పడకగదికి ఓటేశారు. ఇక్కడ పడకగది అంటే కేవలం ఇద్దరి మద్య శారీరక సంబంధం మాత్రమే కాదు.., అన్యోన్యత, దాంపత్యం, భర్తలోని మంచితనం అని అర్ధం. ఎంత డబ్బు ఉన్నా మంచి మొగుడు లేకపోతే ఎందుకు జీవించటం అని అంటున్నారు. డబ్బులు ఎప్పుడయినా సంపాదించుకోవచ్చు అని కొందరు, మేం ఎలాగు డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి, మాకు ఇక రెండవ ఆప్షన్ అయిన బెడ్ ముఖ్యం అని మరికొందరు అభిప్రాయం చెప్పారు. ఇలా ఎవరి వైఖరి వారు వెల్లడించారు. దీంట్లో చాలామంది డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వటంలో తప్పులేదు కాని డబ్బు ఉంటే చాలు అనే వారి ఆలోచన కోణం కాస్త ఇబ్బందికరమైంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian women  husband  rich  latest news  

Other Articles