Andhrapradesh mps chances in central cabinet expansion

cabinet expansion latest news, narendra modi new cabinet, central cabinet ministers, central cabinet expansion, central cabinet expansion list, modi new cabinet, telugu persons in modi cabinet, tdp mps in modi cabinet

andhrapradesh mps chances in central cabinet expansion : andhrapradesh mps trying to get one or two ministries fo the state in latest cabinet expansion. chandrababu talks with modi through phone about cabinet expansion

కేబినెట్ విస్తరణకు ముహూర్తం...

Posted: 11/07/2014 08:27 PM IST
Andhrapradesh mps chances in central cabinet expansion

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఆదివారం మధ్యాహ్నం 1గంటకు మోడి కేబినెట్ విస్తరణ ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విస్తరణకు గడువు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల నేతలు మంత్రి పదవుల కోసం పైరవీలు వేగవంతం చేశారు. ఎవరికి తగ్గట్లు వారు పైరవీలు చేస్తున్నారు. ఇక పార్టీల వారీగా పదవుల సంఖ్యను బీజేపి నాయకత్వం, ప్రభుత్వ పెద్దలు కలిసి నిర్ణయించారని తెలుస్తోంది. పార్లమెంటులో ఉన్న సభ్యుల సంఖ్యా బలాలు, పార్టీతో పొత్తుల లాభాలు ఇతర అంశాలను లెక్కలు చూసుకుని పదవులను కేటాయిస్తున్నారని సమాచారం.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒకటి లేదా రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీ తరపున ఎంపీగా ఉన్న అశోక గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయనతో పాటు గరిష్టంగా మరో ఇద్దరిని పదవులు వరిస్తాయని పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న నేతలు కొందరు చెప్తున్నారు. ఇద్దరికి చాన్స్ లేకపోతే ఒక పదవి మాత్రం ఖాయంగా వస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రధాని, చంద్రబాబు మద్య ఫోన్ సంబాషణ కూడా జరిగింది. విస్తరణ నేపథ్యంలో ఎవరెవరకి పదవులు ఇవ్వాలి, ఎన్ని పదవులు ఇవ్వాలి తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

విస్తరణలో చోటుదక్కే వారిలో ఎక్కువగా అవకాశాలున్నది సుజనా చౌదరికి. పార్టీలో సీనియర్ నేతగా ఉండటంతో పాటు చంద్రబాబుకు సన్నిహిత నేతగా పేరుంది. సామాజిక వర్గం కూడా సుజనాకు కలిసి వచ్చే అంశం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సుజనాకు పదవి ఖాయమని అంతా చెప్తున్నారు. ఈయనకు తోడు యువ ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు కూడా విన్పిస్తోంది. పార్టీకి చెందిన దివంగత సీనియర్ నేత ఎర్రన్నాయుడు తనయుడుగా సుపరిచితుడైన రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఈయనకు పదవి వస్తే.., ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీకి బలం పెరగటంతో పాటు, ఈ జిల్లాల్లో ఎక్కువగా ప్రభావంలో చూపే ఎర్రన్నాయుడు వర్గం, అభిమానులు పార్టీకి మరింత చేరువ అవుతారు అని చెప్తున్నారు. అటు ఇదే జరిగితే యువనేతకు ముందు శివప్రసాద్, సీఎం రమేష్ వంటి సీనియర్లు చాలామంది ఉన్నారు. ఎర్ర తనయుడికి ఇస్తే వీరి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది.

అయితే వీరిద్దరికి పదవుల కేటాయింపుపై మాత్రం స్పష్టత రాలేదు. వస్తే ఇద్దరికి పదవులు రావచ్చు. లేకపోతే ఇద్దరిలో ఒకరికి పదవులు రావచ్చు అని నేతలు చెప్తున్నారు. అయితే ఒకే పదవి వస్తే అది సీనియర్ ఎంపీని వరిస్తుందా.., లేక ప్రజా మద్దతు ఉన్న యువనేతకు దక్కుతుందా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. సుజనాకు మంత్రి పదవి వస్తే, కమ్మ సామాజిక వర్గ ప్రభావం అని చెప్పవచ్చు. ఇదే సమయంలో ఎర్ర తనయుడికి విస్తరణలో చోటు దక్కకపోతే మాత్రం ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఎర్ర కుటుంబం అంటే జనాలతో పాటు రాజకీయ నేతల్లో కూడా మంచి అభిప్రాయం ఉంది. అలాంటి కుటుంబానికి టికెట్ ఇవ్వకుంటే విమర్శలపాలు కాక తప్పదు. టీడీపీ చాణిక్యుడు ఎవరికి మంత్రి పదవి ఇవ్వమని చెప్తాడు... ఎలా వ్యవహరిస్తాడు అనేది చివరి వరకు అంతుచిక్కదు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cabinet  modi  chandrababu  andhrapradesh  

Other Articles