Union cabinet expansion bandaru dattatreya srujana chowdary to get the chance

Bandaru Dattatreya, bjp leader Dattatreya, telangana bjp mp Dattatreya , Union Cabinet expansion , Goa Chief Minister, Manohar Parrikar, Prime Minister, Narendra Modi, TDP leader srujana chowdary, Rajya sabha, Tourism department

Union cabinet Expansion, Bandaru Dattatreya, srujana chowdary to get the chance

కేంద్ర క్యాబినెట్ లో దత్తన్న, సృజనాలకు అవకాశం..?

Posted: 11/07/2014 11:03 AM IST
Union cabinet expansion bandaru dattatreya srujana chowdary to get the chance

కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరన నవంబర్ 9న జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అపాయింట్ మెంట్ ను ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మంత్రివర్గ విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెలలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి జరుగుతున్న విస్తరణలో పదిమంది కొత్తవారికి అవకాశం దక్కనుందని సమాచారం. పలువురు మంత్రుల శాఖలు కూడా మారనున్నాయి. రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్ల్లు తెలిసింది.

మే నెలలోనే ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని భావించినప్పటికీ చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినందున అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం రాష్ట్రం నుంచి తప్పనిసరిగా ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు కేంద్ర క్యాబినెట్‌లో చోటు ఖాయమైంది. ఆయనకు రక్షణశాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కేంద్రంలో బాధ్యతలు స్వీకరించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా తనను కోరారని పారికర్ తెలిపారు. ఈ విస్తరణలో బీజేపీ మిత్రపక్షాలైన శివసేనకు రెండు మంత్రి పదవులు, టీడీపీకి ఒకటి దక్కనున్నట్లు తెలిసింది.

కేంద్ర మంత్రిమండలిలో టీడీపీకి మరో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీకి ఒక స్థానం లభిస్తుందని, అది రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరికి దక్కుతుందని ఆ పార్టీ నేతలు పేర్కోంటున్నాయి. తొలి దఫాలోనే ఇద్దరికి చోటు కల్పిస్తారని భావించినా.. ఒక్కరికే స్థానం దక్కడంతో, ఆ ఆవకాశాన్ని సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు ఇచ్చారు. దీంతో ఆయనకు ఈసారి చోటు లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సృజనా చౌదరికి పర్యాటక శాఖ అప్పగించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles