Thieves gang raped women in front of her husband threatened to upload video if approches police

Thieves gang raped women in front of her husband, threatened to upload video if approaches police

Thieves gang raped women in front of her husband, threatened to upload video if approches police

బెంగళూరులో మరో ‘దండుపాళ్యం’ గ్యాంగ్ దారుణం..

Posted: 11/05/2014 09:14 AM IST
Thieves gang raped women in front of her husband threatened to upload video if approches police

బెంగళూరులో దారుణం జరిగింది. దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో ఏర్పడ్డ దొంగల ముఠా ఆ చిత్రం తరహాలోనే  నగలు, నగదు లూటీ చేశారు. అనంతరం భర్త, అత్త, కుమారుడి కళ్లముందే ఆ గృహిణి (25)పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో రికార్డ్ చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాము రికార్డ్ చేసిన వాటిని ఇంటర్‌నెట్‌లో పెట్టి పరువు తీస్తామని బెదిరించి పారిపోయారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పడు బెంగళూరులోని తీవ్ర చర్చకు కారణమవుతోంది. తమ ఇళ్లల్లో కూడా భద్రత కరువవ్వడంపై గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సమీపంలోని ఇగ్గలూరులోని గ్రీన్‌గ్రేన్ లేఔట్‌లో ఓ వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. అక్టోబర్ 24వ తేదీ రాత్రి 11.45 గంటల సమయంలో నలుగురు నిందితులు అతని ఇంటికి వచ్చారు. తాము పోలీసులమని చెప్పడంతో ఆ వ్యక్తి తలుపులు తీశాడు. ఇంటిలోకి వెళ్లిన వారు ఆ కుటుంబ సభ్యులను బెదిరించారు. బీరువాలో ఉన్న రూ. 10 వేలు, రూ. లక్ష విలువైన బంగారు నగలు దోచుకున్నారు. అంతటితో ఆగకుండా యజమాని భార్య చీరను లాగేశారు. అదే చీరతో ఆ వ్యక్తిని, అతని తల్లిని, అతని కుమారుడిని మంచానికి కట్టేశారు. తరువాత మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే అత్యాచారం చేసిన దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ తెలిపారు. అయితే తమ ఇంట్లో జరిగిన విషయాన్ని గుట్టుగానే వుంచిన కుటుంభసభ్యులు.. పోలీసులకు సైతం పిర్యాదు చేయలేదట.

నాలుగు రోజుల తరువాత పరువు పోతుందని భయపడిన ఆ ఇంటి యజమాని తమ ఇంటిలో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత నేరస్తుల ఫొటోలను ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు చూపించారు. ఓ నిందితుడ్ని ఆ కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ నిందితుడి ఆధారంగా మిగిలిన వారినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని  నందీష్, అతని అనుచరులు అనీల్ కుమార్, సుజిత్ కుమార్ అలియాస్ సుజిత్, సెమైన్‌గా గుర్తించారు. నందీష్ పాత నేరస్తుడని, అతనిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని అలోక్ కుమార్ చెప్పారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరిచామని, న్యాయమూర్తి అనుమతితో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles