I click atm listening women problems in bhuvaneswar

i click atm, i click listening atm, atm listens women problems, bhuvaneswar i click atm, i click women problems solving atm, atm solves women problems, odisha latest news, odisha police, women harassment

atm listening women's problems in bhubaneswar : in odisha capital bhuvaneswar police officer jaideep made a atm to listen women problems getting good response. i click atm solving women's problems in bhuvaneswar

ఒడిశాలో మహిళల బాధలు వింటున్న ఏటిఎం

Posted: 11/04/2014 08:42 PM IST
I click atm listening women problems in bhuvaneswar

గోడలకు చెవులు ఉంటాయని సామెతలు విన్నాము... రోబోలు మనుషుల మనోభావాలు అర్ధం చేసుకుంటాయని చదువుకున్నాము. కాని ఏటీఎంలు ఆడవారి కష్టాలను వింటాయనే విషయం తెలుసా..? ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఉన్న ఓ ఏటియం డబ్బులివ్వటం లేదు. కేవలం ఆడవారి సమస్యలు విని.., వాటిని పరిష్కరించేందుకు సహాయం చేస్తోంది. సమాజంలో మహిళలు పడుతున్న ఇబ్బందులు, ఇతరులతో తమ కష్టాలను చెప్పుకోలేక పడుతున్న మనోవేదనను అర్ధం చేసుకున్న పోలిస్ శాఖ ఉద్యోగి ఈ యంత్రాన్ని తయారు చేశారు.

ఒడిశా పోలిస్ శాఖలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే జైదీప్ అనే అధికారికి మహిళల సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఆలోచనే ఈ మెషీన్. దీనిపేరు ‘ఐ క్లిక్’ ఏటియం. బ్యాంకు ఏటియం పక్కనే ఏటియం మెషీన్ లాంటిదే మరొక మిషన్ (ఐ క్లిక్) ఏర్పాటు చేశారు. దీన్లో అమర్చిన మైక్రో ఫోన్ మహిళల సమస్యలు విని.. రికార్డ్ చేసి వెంటనే పోలిసులకు చేరవేస్తుంది. ఈ రికార్డింగ్ విన్న పోలిసులు బాధితురాలికి తమ శాఖ తరపున చేయగలిగిన సహాయం చేస్తారు. గృహహింస, లైంగిక వేధింపులు, ఇలా ఇతర మహిళా సమస్యలను పరిష్కరించేందుకు ఈ మెషీన్ ఉపయోగపడుతుంది.

పోలిస్ స్టేషన్లకు వెళ్ళలేక, పోలీసుల నుంచి కూడా వచ్చే అవమానాలు భరించలేక కుంగిపోయే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ యంత్రంకు ఆశించిన స్పందన వస్తోంది. ప్రస్తుతం రోజుకు ఐదు లేదా ఆరుగురు మహిళలు తమ సమస్యలను ఏటిఎంతో చెప్పుకుంటున్నారు. భవిశ్యత్తులో ఈ తరహా ఏటిఎంలు మరిన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఒడిశా పోలీసులు చెప్తున్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఈ కృషిని మెచ్చుకోవాల్సిందే.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atm  women  odisha  latest news  

Other Articles