Political parties not interested in farmers problems

farmers problems in telangana, farmers suicide in andhrapradesh, farmers problems, government plans for farmers, agriculture in telangana, agriculture in india, agriculture development, latest news

political parties not interested in farmers problems : all political parties are doing politics only they not interested in solving farmers problems. all parties just to show sympathy on farmers no one is not involved to do a movement for farmers cause with out political interest

అన్ని పార్టీలు అన్నదాతకు సున్నం పెట్టేవే.... ఏం లాభం

Posted: 11/03/2014 05:34 PM IST
Political parties not interested in farmers problems

తల పగలగొట్టేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా... అన్నం పెట్టే రైతన్నను మోసం చేసేందుకు ఏ పార్టి అయితేనేం. ప్రతి ఒక్కరూ వాడుకుని వదిలేసే వారే తప్ప..., బాగుచేద్దాం అనే మనస్సుతో పోరాడేవారు అస్సలు కన్పించటం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా ఏ రాష్ర్టం తీసుకున్నా నేతలంతా అన్నదాతలకు సున్నం పెట్టేవారే. ఎవరో వస్తారని..., ఏదో చేస్తారని పగ్గాలు అప్పగిస్తే అవే రైతన్నలను చర్నాకోలలై తరుముతున్నాయి. నమ్మిన వారి దెబ్బలకు తాళలేక, సర్కారుపై పెట్టుకున్న ఆశలను చంపుకోలేక తనువు చాలస్తున్నారు మన రైతన్నలు.

రాజకీయ పార్టీలు రైతు సమస్యల గురించి పోరాడటం కొత్తేమి కాదు. ఇప్పటివరకు రైతుల గురించి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాని సమస్యకు మాత్రం పరిష్కారం లభించటం లేదు. ప్రతి పార్టీ పోరాటాలు చేసి రైతు సమస్యను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకునేదే తప్ప.., పరిష్కారమార్గం దిశగా ఉద్యమించిన దాఖలాలు లేవు. పంట వేద్దామంటే విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, పంట వేశాక ఎరువుల కొరత, కరెంటు కోతలు, చేతికి వచ్చే సమయంలో నీరు లేక ఇబ్బందులు పంట చేతికి వస్తే మార్కెట్ కు వెళ్తే గిట్టుబాటు ధర ఉండదు. దీనికి తోడు మాయదారి దళారి వ్యవస్థ. ఇలా ఆది నుంచి అంతం వరకు సమస్యలే ఉంటే సాగు పరిస్థితి ఏమిటి. విద్యుత్ సమస్య ఉన్నపుడు దానికి వ్యతిరేకంగా పోరాడే బదులుగా..,, ఎందుకిలా వచ్చిందని ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారంకు ఏం చేయాలి అని ఎవరైనా ఆలోచిస్తారా.

కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఇలా ఏ పార్టీ అయినా సరే. అధికార పక్షంను విమర్శించకుండా అసలు కారణం ఏమిటి అని అడిగే ప్రయత్నం పొరపాటున కూడా చేయరు. ఎందుకంటే వారికి ఇదంతా అవసరం లేదు. సమస్య ఉందా.. దాని గురించి మాట్లాడి ప్రభుత్వాన్ని తిట్టిపోసి.. హెచ్చరిస్తే అంతిటతో తమ పని అయిపోతుంది అనుకుంటున్నారు. కాని నాయకత్వం అంటే ఇది కాదు. ప్రజా సమస్యల పరిష్కారం ఇలా ఎప్పటికీ జరగదు. ఎమ్మెల్యేలకు జీత, భత్యాల పెంపు బిల్లు పెడితే అన్ని పార్టీలు ఒక్కటై... వందశాతం అనుకూలంగా ఓటు వేస్తాయి. అదే రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించమంటే కమిటీలు, సర్వేలు, ఉప సంఘాలు, బిల్లు, చర్చ.. ఈ పేరుతో రచ్చ చేయటం తప్ప ఒరిగేదేమి లేదు.

రైతలను కూడా పార్టీలు, ప్రాంతాల వారిగా విభజించి వారికి చేసే సాయంలో కూడా తేడాలు, వివక్షలు చూపుతున్నారు. అన్నదాత కష్టపడేది దేశం కోసమే కాని తన వర్గం తినాలనో లేక కేవలం తన ప్రాంతానికే చెందాలనే బుద్దితో సేద్యం చేయడు. అదే జరిగితే రైతన్నల ఆగ్రహానికి అన్ని పార్టీల నేతలు బలిఅవుతారు. రైతన్న దేశానికి వెన్నుముక అని గొప్పగా చెప్పుకోవటం కాదు.. అలాంటి వెన్నుముకకు ఏ కష్టం వచ్చినా వెంట ఉండటం రైతు సంక్షేమం. ఇది చేయలేని వారికి చేతగాని వారికి రైతు వర్గ పార్టి అని చెప్పకునే అర్హత లేదు. సమస్య ఒకటే అయినపుడు ఇన్ని పార్టీలు, ఉద్యమాలు ఎందుకు..? అంతా కలిసి ఐక్య ఉద్యమం చేస్తే ఏదైనా సాధ్యమే. ఇప్పటికైనా రాజకీయాల కోసం కాకుండా రైతు సమస్యల కోసం పోరాడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  agriculture  political parties  

Other Articles