Narendra modi government takes decision to release the funds for sikhs families who died in the agitations after indiragandhi assasinated

narendra modi news, narendra modi government, narendra modi sarkar, modi sarkar, indiragandhi assassination, congress government, shiela dixit government, sikhs agitations

narendra modi government takes decision to release the funds for sikhs families who died in the agitations after indiragandhi assasinated

సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్!

Posted: 10/30/2014 09:03 PM IST
Narendra modi government takes decision to release the funds for sikhs families who died in the agitations after indiragandhi assasinated

బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్రమోడీ కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షిస్తూనే వస్తున్నారు. మొదట్లో రైలుటికెట్ ధరలు, ఐరన్, ఇతరత్ర వ్యవహారాలపై భారీగా రేటు పెంచేసినా.. దేశ అభివృద్ధికోసమే అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొని ప్రజలను శాంతింపజేశారు. తర్వాత ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ‘‘జన్ ధన్’’ పేరిట పేదప్రజలకోసం ఫ్రీగా బ్యాంకు ఖాతాలను తెరుచుకోవడానికి వీలుగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎవరికైతే బ్యాంకు ఖాతా వుంటుందో.. వాళ్లకి నేరుగా సంక్షేమ నిధులు అందివ్వాలనే లక్ష్యంతో అది ప్రవేశపెట్టారు. అలాగే నిన్న ‘‘స్వచ్ఛ భారత్’’ పేరిట ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి.. దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నారు. మొత్తానికి మోడీ ఏదో ఒకవిధంగా ప్రజలకు దగ్గరవ్వడానికి చాలానే కష్టపడుతున్నారు.

ఇదిలావుండగా.. తాజాగా మోడీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కాంగ్రెస్ అమలుచేయలేని ఒక పనిని పూర్తి చేయడానికి పూనుకుంది. ఆనాడు ఇందిరాగాంధీని ఒక సిక్కు జాతికి చెందినవాడు చంపేశాడనే నెపంతో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సిక్కుల కుటుంబాలకు చెందిన కొన్నివేలమంది చనిపోయారు. అప్పట్లో ఆ కుటుంబాలకు నష్టపరిహారంగా డబ్బులు చెల్లిస్తామని ఢిల్లీలో షీలాదీక్షిత్ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం హామీలు ఇచ్చాయి కానీ అమలుచేయడంలో విఫలమయ్యాయి. అయితే ఇప్పుడున్న మోడీ సర్కార్ ఆ సిక్కుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి ఐదులక్షల రూపాయలను చెల్లించాలని మోడీ సర్కార్ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ నిర్ణయంతో దాదపు 3,325 మంది కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles