Belgian plan to give beer to schoolchildren

Belgian plan to give beer to schoolchildren, beer to schoolchildren, obesity controlling tips, obesity causes and solutions, problems with obesity, how to control drinking, how to loss weight, world latest news

Belgian plan to give beer to schoolchildren : a belgian beer society plans to give weak brew called tafelbier to avoid them from drinking sugar drinks which causes obesity

స్కూల్ పిల్లలకు బీర్లు ఇవ్వాలని నిర్ణయం

Posted: 10/30/2014 03:28 PM IST
Belgian plan to give beer to schoolchildren

బోర్ కొడితే బీర్ కొట్టడం అలవాటైన వారు చాలా మందే ఉన్నారు. బీర్ తాగితే కూడా మందు తాగినట్లే. ఎందుకంటే ఇందులో కూడా ఆల్కహాల్ శాతం ఉంటుంది కాబట్టి. కాని బెల్జియంలో స్కూలు పిల్లలకు బీర్లు ఇవ్వాలని నిర్ణయించారట. వినటానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. అదికూడా వారిని చదివించటానికో.. లేక రుచి చూపించటానికో కాదు బరువు, లావు తగ్గించటానికట. అదేమిటి బీరు తాగితే లావు అవుతారు కదా అనుకుంటున్నారా. అక్కడే మీరు పొరపాటు పడ్డారు. బీరు తాగినంత మాత్రాన లావు అవుతారని ఖచ్చితంగా చెప్పలేము. అది వ్యక్తుల శరీరం, వారు చేసే పనులు, పాటించే పద్దతులను బట్టి ఉంటుంది. రోజు క్రమం తప్పకుండా పది బీర్లు తాగినా సన్నగా ఉన్న వారు వెతికితే మనచుట్టూ చాలామందే ఉంటారు.

ఇక అసలు విషయానికి వస్తే.. కూల్ డ్రింక్స్, చక్కెర కలిసిన ఇతర సాఫ్ట్ డ్రింక్స్ తాగి స్కూలు పిల్లలు ఊబకాయులుగా తయారవుతున్నారట. దీంతో బెల్జియం బీర్ సొసైటికి చెందిన రోనీ లాగెనాకెన్ అనే వ్యక్తి పిల్లలకు బీర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో పెరుగుతున్న ఊబకాయుల సంఖ్యపై జరిపిన సర్వేల వివరాలు పరిశీలించి ఆయన ఈ నిర్ణయానికి వచ్చారట.  సాధారణ బీర్లలో ఉండే ఆల్కహాలు శాతం (దాదాపుగా 5.5%)ను 1.2 లేదా కాస్త ఎక్కువ మోతాదులో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 25నుంచి 33సెంటీలీటర్ల సైజులో ఉండే ఈ లైట్ అండ్ డైట్ బీరును టాఫీల్బీర్ అని పిలుస్తున్నారు.

దీనికి పలవురు మద్దతు పలికారు కూడా. అంతేకాకుండా రోజు స్కూలు పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఈ బీర్లు ఇవ్వాలని సలహాలు ఇస్తున్నారు. ఇక బీర్లు ఏ ఒక్కరికో కాదు. ‘బీరు కుటుంబం మొత్తానికి’ అని నినాదాలు కూడా మొదలయ్యాయి. ఇక పాఠశాలల్లో 3నుంచి 15ఏళ్ళలోపు పిల్లలకు బీర్లు ఇస్తారట. 15సం. వయస్సు వస్తే పిల్లల్లో పరిపక్వత రావటంతో పాటు శరీరం కాస్త దృఢంగా తయారవుతుంది. కాబట్టి అప్పటివరకు బీర్లు ఇస్తూ జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఇదేమి విచిత్రమో కదా.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer to schoolchildren  obesity  latest news  belgian  

Other Articles