Wife nehasen drunk acid for not taking her husband vishal to watch shahrukh khans happy new year

wife drunk acid, nehasen drunks acid, madhya pradesh movie incident, happy new year movie, madhya pradesh wife husband clashes, wife nehasen drunk acid, shah rukh khan

wife nehasen drunk acid for not taking her husband vishal to watch shahrukh khans happy new year

భర్త మూవీకి తీసుకెళ్లలేదని.. భార్య ఏంచేసిందో తెలుసా?

Posted: 10/29/2014 08:28 PM IST
Wife nehasen drunk acid for not taking her husband vishal to watch shahrukh khans happy new year

ప్రస్తుత జనరేషన్ లో సినిమాల పిచ్చి ఎవరికుండదో చెప్పండి... చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరూ లైఫ్ లో ఎంజాయ్ మెంట్ కోసం అప్పుడప్పుడు సరదాగా సినిమాలు చూడటం సహజం! అయితే అదే సినిమాను థియేటర్ లో చూస్తే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అందుకే.. చాలామంది ఎంత రద్దీగా వున్నా థియేటర్లకు వెళ్లే సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటారు. ఇలాగే ఒక భార్య తనను మూవీకి తీసుకెళ్లాల్సిందిగా భర్తను పట్టుబడితే... అతను తీసుకెళ్లనని తిరస్కరించాడు. దీంతో తీవ్రనిరాశకు గురైన ఆమె ఏం చేసిందో తెలుసా..?

మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో విశాల్-నేహ సేన్ అనే పెళ్లైన జంట నివాసముంటోంది. ఇటీవల బాలీవుడ్ నటుడు షారుఖ్ నటించిన ‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ సినిమాను చూడ్డానికి ఆదివారం(26-10-2014)నాడు భర్త విశాల్ సిద్ధమయ్యాడు. అదే సమయంలో తనను కూడా తీసుకెళ్లాలంటూ భార్య నేహ సేన్ అడిగింది. అయితే ఆరోజు థియేటర్ మొత్తం జనాలతో రద్దీగా వుంటుందని తన భార్యను తీసుకెళ్లకుండా విశాల్ ఒక్కడే సినిమాకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన నేహ.. భర్త వెళ్లిన కొద్దిసేపటికి యాసిడ్ తాగేసింది.

అంతే! ఆమె అక్కడి నుంచి నేరుగా గ్వాలియర్ ఆసుపత్రిలో చేర్చబడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో వుందని.. యాసిడ్ తాగడం వల్ల అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిన్నాయని పోలీసులు వివరించారు. ఈ విషయంపై ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశామని తెలిపారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలున్నాయా..? లేవా..? అనే కోణంలో విచారణను చేపట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles