బస్సు ప్రయాణం, కారు ప్రయాణం లేదా రైలు ప్రయాణం.. ఏ జర్నీ చేసినా దాదాపు అందరూ కిటికి పక్కనే కూర్చోవాలని కోరుకుంటారు. కొత్త ప్రాంతాలు, ప్రకృతి అందాలను దగ్గరినుంచి చూసేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక విమాన ప్రయాణం అయితే చెప్పనవసరం లేదు. మబ్బులను చీల్చుకుంటూ ఆకాశంలో దూసుకెళ్ళటం ఒక అనుభూతి అయితే.. ఆకాశ మార్గాన్ని విండో నుంచి వీక్షించటం మరో అనుభూతి. అయితే ఇది కిటికీ పక్కన కూర్చున్నవారికే సొంతం అవుతుంది. కాని కొత్తగా వచ్చే విమానాలను కిటికీలు లేకుండా చేస్తుందో సంస్థ.
విమానాలకు కిటికీలు లేకుండా ఎలా అనే కదా మీ సందేహం.. విండోలను తొలగించినా వాటి స్థానంలో అత్యాధునిక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. బ్రిటన్ కు చెందిన సెంటర్ ఫర్ ప్రాసెస్ ఇన్నోవేషన్ (సీ.పీ.ఐ.) అనే సంస్థ ఈ టెక్నాలజిని అభివృద్ధి చేస్తోంది. విమానాల కిటికిల స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన ఆర్గానిక్ ఎల్.ఈ.డి. తెరలను అమర్చుతారు. విమానం బయట కెమెరాలను ఏర్పాటు చేసి దాన్ని లోపల ఉన్న ఎల్.ఈ.ఢీ.ల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అంటే విమానంలో కూర్చునే బయటి చిత్రాలను నేరుగా చూడవచ్చన్నమాట.
ఇలా విమానం మొత్తం పెద్ద తెరలు ఏర్పాటు చేయటం వల్ల అందరికి సులువుగా బయటి వాతావరణం కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుంది. ఇది అత్యంత పలుచగా ఉన్న తెర అంతేకాకుండా చాలా ధృఢంగా కూడా ఉంటుంది అని చెప్తున్నారు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయని సీపీఐ చెప్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తెరల ఏర్పాటుతో కలిగే లాభాలు :
* భారీ సైజుల్లో ఉండే కిటికీలకు బదులు స్ర్కీన్లను వాడటం వల్ల విమానం బరువు తగ్గి ఇంధనం చాలా వరకు ఆదా అవుతుంది.
* కిటికీల స్థానంలో పలుచటి తెరలను అమర్చటం వల్ల చాలావరకు ఖాళీ స్థలం ఏర్పడుతుంది. దీని వల్ల క్యాబిన్ లో తిరిగేందుకు చోటు పెరుగుతుంది.
* ఇక భారీ తెరలతో పాటు ప్రతి ప్రయాణికుడి సీటు ముందు చిన్న సైజు తెరలు అమర్చారు. ఫలితంగా వారు ఎదురుగా కూర్చుని కూడా చూడవచ్చు.
* ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా.., బయటి వాతవరణం స్పష్టంగా కన్పించేలా అత్యాధునిక కెమెరాల ఏర్పాటు.
ఇక ఈ టెక్నాలజి అమల్లోకి వచ్చేందుకు మరో పదేళ్ళు పడుతుందని సీపీఐ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి కిటికీల్లేని ప్రయాణం ఎలా ఉంటుందో ఈ వీడియో చూసి తెలుసుకొండి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more