Sundar pichai become google product chief

google jobs, google maps, google office, google india jobs, sundar pichai google, sundar pichai google chief, latest news, websites, how to create website, world latest updates

sundar pichai become google product chief : as per latest information india born sundar pichai become as google product chief. in a major resturcturing of google management india born sundar pichai become product chief for google

గర్విద్దాం : గూగుల్ చీఫ్ గా భారతీయుడు

Posted: 10/27/2014 12:15 PM IST
Sundar pichai become google product chief


ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ముఖ్య విభాగాల చీఫ్ గా ఒక భారతీయుడికి బాధ్యతలు అప్పగించారు. ప్రముఖ టెక్నాలజి మ్యాగజైన్ అందించిన సమాచారం ప్రకారం.., సుందర్ పిచ్చైని గూగుల్ కోర్ ప్రొడక్స్ట్ చీఫ్ గా నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుందర్.. గూగుల్ అందిస్తున్న ఆండ్రాయిడ్, క్రోమ్, గూగుల్ యాప్స్ వంటి ఉత్పత్తులకు ఇన్ చార్జ్ గా ఉన్నాడు. ఇకపై వీటతో పాటు మిగతా ముఖ్య విభాగాలన్నిటికీ చీఫ్ గా వ్యవహరించనున్నాడు.

గూగుల్ పరిశోధన, శోధన, మ్యాప్స్, గూగుల్ ప్లస్, కామర్స్, వాణిజ్య ప్రకటనలు, ఇతర ముఖ్య విభాగాలపై సుందర్ పర్యవేక్షణ ఉంటుందని మ్యాగజైన్ కధనం ప్రచురించింది. గూగుల్ లోని ఆరు విభాగాలకు ఇన్ చార్జ్ లుగా ఉన్న వ్యక్తులు ఇప్పటివరకు నేరుగా పేజి(యాజమాన్యం)కు తమ పనుల గురించి రిపోర్ట్ చేస్తుండగా ఇకపై సుందర్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కధనం తెలిపింది. అంటే అన్ని విభాగాలపై సుందర్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది అని స్పష్టం అవుతోంది. ఇలా చేయటం వల్ల వివిధ విభాగాలకు సంబంధించి సమాచార సేకరణ ఆలస్యం తగ్గించటంతో పాటు.., నేరుగా కొత్త ఉత్పత్తుల గురించి చర్చించే అవకాశం ఉంటుంది.

1972లో చెన్నలో పుట్టిన సుందర్ పిచ్చై 2004లో గూగుల్ లో చేరాడు. అంతకు ముందు అప్లయిడ్ మెటిరియల్స్ మరియు మెక్ కిన్సే కంపనీలో పనిచేశాడు. గూగుల్ లో చేరిన తర్వాత కూడా సుందర్ టాలెంట్ ను మెచ్చి ట్విట్టర్ వంటి సంస్థలు పలు కీలక బాద్యతల నిర్వహణ కోసం సుందర్ ను సంప్రదించాయి. అయితే ఆయన గూగుల్ ను వీడలేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sundar pichai  latest news  google  india  

Other Articles