Be careful in slapping anti dowry law in matrimonial dispute says home ministry

Home Ministry, state governments, judicious, anti-dowry, matrimonial disputes, police, no automatical arrest, Section 498-A., punish, imprisonment, Supreme Court

Be careful in slapping anti-dowry law in matrimonial dispute says Home ministry

వరకట్న కీచకుల అరెస్టుకు తోందరపడవదట..

Posted: 10/26/2014 05:08 PM IST
Be careful in slapping anti dowry law in matrimonial dispute says home ministry

వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఇవాళ పలు సూచనలు చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ మహిళలు చేసే ఫిర్యాదులతో 498 - ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదేశించింది. అయితే ఈ సెక్షన్ కింద అరెస్టులకు మాత్రం తోందరపడవద్దని సూచించింది. భార్యా, భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో సెక్షన్ 498-ఎ ను కొంతమంది ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో కేసు పెట్టిన వెంటనే అరెస్టులు చేయవద్దని సూచించింది. ఈ మేరకు పోలీసు అధికారులను తగు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. కేసు నమోదు అయిన తర్వాత పూర్వాపరాలు పరిశీలించాలని.. నిజంగా వరకట్నం కోసం భార్యను హింసించినట్టు దర్యాప్తులో తేలిన పక్షంలోనే అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన సూచనల్లో పేర్కొంది.

498-ఎ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో చాలా మటుకు భార్యభర్తల వైవాహిక జీవితంలో వచ్చే తగవులతోనే ముడిపడి వున్నాయని, వీటికి వరకట్న కేసులకు సంబంధం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో 498-ఎ సెక్షన్ కింద అరెస్టు చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని అదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నాతాధికారులకు కూడా ఈ మేరకు సూచనలు జారీ చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles