Ysr congress party leader bhuma nagi reddy thanks to pawan kalyan

pawan kalyan news, bhuma nagi reddy news, allagadda unanimous elections, ysr congress party news, tdp party news, pawan kalyan latest news, pawan kalyan gopala gopala movie, pawan kalyan ysr congress party, bhuma nagi reddy pawan kalyan, pawan kalyan allagadda unanimous elections

ysr congress party leader bhuma nagi reddy thanks to pawan kalyan for supporting allagadda Unanimous elections

ఆళ్లగడ్డ ఉపఎన్నిక ఏకగ్రీవం వెనుక పవన్ హస్తం?

Posted: 10/24/2014 09:15 PM IST
Ysr congress party leader bhuma nagi reddy thanks to pawan kalyan

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ - టీడీపీ పార్టీల తరఫున ప్రచారం చేసిన జనసేనాధిపతి-పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏమేర విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మీద విమర్శనాస్త్రాలకు సంధించారు పవన్! ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో అన్యాయాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటాయని.. రాష్ట్రాభివృద్ధి పూర్తిగా వెనుకబడి పోతుందంటూ రకరకాలుగా ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఇంతలోనే ఏమైందో ఏమో.. ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారనే పుకార్లు బాగానే షికార్లు చేస్తున్నారు. ఆయన ఇచ్చిన సహకారంతోనే ఆళ్లగడ్డ ఉపఎన్నిక ఏకగ్రీవం అయిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో పవన్ హస్తం వుందో లేదో స్పష్టంగా తెలియదు కానీ.. వైకాపా నేత భూమానాగిరెడ్డి మాత్రం ఈ వ్యవహారంలో పవన్ పేరును బయటకు తీశారు. ఆళ్లగడ్డ ఉపఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు పవన్ కల్యాణ్ కృషి చేశారని.. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీకి దింపకుండా చంద్రబాబుతో పవన్ మాట్లాడినట్టు గతంలో వార్తలు సందడి చేసిన సంగతి తెలిసిందే! అప్పట్లో పవన్ అలా బాబుతో మంతనాలు జరిపారో లేదో ఖచ్చితంగా తెలియదు కానీ.. భూమానాగిరెడ్డి సంధించిన వ్యాఖ్యాల అనుసారం నిజమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ విషయంపై పవన్, టీడీపీ పార్టీ ఏం స్పందించనుందో వేచి చూడాల్సిందే!

మరోవైపు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపథ్యంలో... ఈ విజయాన్ని తన తల్లి శోభానాగిరెడ్డికి అంకితం చేస్తున్నట్టు అఖిల ప్రియ చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించిన ప్రధాన పార్టీలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే! దీంతో ఉపఎన్నిక తప్పనిసరి అయింది. అయితే ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నికకు దూరంగా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇలా జరగడానికి పవన్ హస్తం ముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  bhuma nagi reddy  ysr congress party  allagadda unanimous elections  

Other Articles