Haryana paanwala gets rs 132 crore power bill

132 crore power bill, paanwala, haryana electricit board, bijili vitharan board, haryana, sonipat, rajesh

haryana paanwala gets rs 132 crore power bill

కిల్లీకొట్టుకు రూజ 132 కోట్ల కరెంటు బిల్లు

Posted: 10/24/2014 07:16 PM IST
Haryana paanwala gets rs 132 crore power bill

కిళ్లీకొట్టు పెట్టుకుని బతికే ఓ బడుగుజీవికి దీపావళి రోజున పెద్ద షాక్ తగిలింది. తాను నడుపుతున్న కిల్లీ కోట్టుతో జీవనం ఎలా సాగించాలో తెలియక సతమతమవుతున్న ఆ అభాగ్యుడికి విద్యుత్ శాఖ ఏకంగా షాక్ ఇచ్చింది. తాను తన జీవితకాలంలో ఎంతగా కాల్చిన రానంత బిల్లును అతడికి అందించింది. ఎంతనుకుంటున్నారు. ఏకంగా 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు చెల్లించాలంటూ అతనికి బిల్లును పంపింది.

ఈ సంఘటన హర్యానాలోని సోనిపట్ జిల్లా గొహానా పట్టణంలో జరిగింది. అక్టోబర్ నెలకు గాను రాజేష్ అనే ఆ చిరు వ్యాపారికి 132.29 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి తాను షాకయ్యానని, ముందు కేవలం అంకెల్లో ఏదో రెండు మూడు సున్నాలు ఎక్కువ వచ్చాయనుకుంటే, అక్షరాల్లోకూడా అలాగే ఉందని రాజేష్ చెప్పాడు. చిన్న దుకాణం అద్దెకు తీసుకుని ఓ లైటు, ఓ ఫ్యాను పెట్టుకుని ఉంటున్నానని, తనకు మహాఅయితే వంద, రెండెందల రూపాయల విద్యత్ బిల్లు వస్తుందే తప్ప..కోట్ల రూపాయల బిల్లు వస్తే తానేంచేసేదని ఆందోళన చెందుతున్నాడు. అతిగా విద్యుత్ ను వినియోగించినా.. ఐదు వందల రూపాయలకు మించి బిల్లు ఎప్పుడూ రాలేదని అన్నాడు.

ఉత్తర హర్యానా బిజిలీ వితరణ్ నిగమ్ ఈ బిల్లు జారీచేసింది. గతంలో కూడా హర్యానాలో ఇలా భారీ స్థాయిలో బిల్లులు వచ్చాయి. 2007 ఏప్రిల్లో మురారీలాల్ అనే మరో వ్యక్తికి ఏకంగా 234 కోట్ల రూపాయల బిల్లు కూడా వచ్చింది. ఈ ఘనత కూడా హర్యానా విద్యుత్ బోర్డుదే. అయితే తప్పులపై తప్పులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఆ శాఖ అధికారులు ఇప్పటికైనా కల్లు తెరవాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles