Arranged marriages are fixed in india

Arranged Marriages, Fixed, India, abroad, doubts., messy, hullabaloo, secret, magic, tricks

Arranged Marriages Are Fixed In India

ప్రపంచప్రఖ్యాతి గాంచిన భారతీయ వివాహాలు

Posted: 10/24/2014 06:31 PM IST
Arranged marriages are fixed in india

భారతీయ వివాహాలు.. సంప్రదాయబద్దంగా సాగే ఉత్సవం మాదిరిగానే వుంటుంది. ఎంతో చిన్నది జీవితం' అని వ్యక్తిపరంగా చెప్పుకున్నా వ్యవస్థాపరంగా మానవ జీవన వికాసం ఆవిర్భావం నుండి ఎంతో లోతైన సముద్రంగా కన్పిస్తుంది. మానవ సంఘం వికాస, ప్రాచుర్య, విఖ్యాతాలకు మూలం కుటుంబం. ఆ కుటుంబానికి పునాది వివాహం. అసలు వివాహం అంటే 'వి' విశిష్టంగాను వాహం. అంటే పొందతగినదిగాను ప్రత్యేకార్థాన్ని మన శాస్త్రాలు తెలియజేశాయి. విశిష్టమైన దానిని పొందడం అంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకరినోకరు పోందటమే.. అప్పటి వరకు ఒకరుకోకరు తెలియకపోయినా, ఇష్టాలు కలవుక పోయినా.. మూడు ముళ్లు వేసిన తరువాత ఇద్దరూ ఒక్కటేనని, మధ్య వయస్సు వచ్చిన తరువాత ఇద్దరరితో పాటు పుట్టిన పిల్లలతో కలసి తమది ఓక కుటుంబమని ఆ చక్రబంధంలోనే వుండాలని భావన కేవలం మన దేశంలోనే మాత్రమే కనబడే సంస్కృతి.

భారతీయ ధార్మిక వ్యవస్తలొ, వివాహం అత్యంత విశిష్టమైనది, కుటుంబిక జీవన విధానానికి,సత్సమాజ  నిర్మాణానికి మూలం, వేదాలు చెప్పినట్లుగా క్రతువుల నిర్వహణకు, భారతీయ వివాహం ధర్మబద్ధమైనదని వేదాలు వెల్లడిస్తున్నాయి. ధర్మార్ధ సిద్ధికి ధర్మపత్ని శ్రేష్టమైన సాధనమని ఘోషిస్తున్నాయి. మ్యారెజెస్ ఆర్ నాట్ ఫర్ రిక్రియేషన్ బట్ ఫర్ క్రియేషన్ అనే అర్థాన్నిస్తున్నాయి. కొందరని  మినహా నూటికి 99 శాతం సంప్రదాయక పద్దతులలో వివాహం చేసుకున్న వాళ్లు.. మూడు ముళ్లు, ఏడు అడుగులతో నిండు నూరళ్ల పాటు జీవిస్తూనే వున్నారు. జీవిస్తూనే వుంటారు. అదీ మన భారత దేశ సంప్రదాయాలు, సంస్కృతుల గొప్పదనం.

అయితే పెళ్లిళ్లు ఎలా జరుగుతాయ్..? ఎలా జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు అంటే మాత్రం ఇక్కడ పెద్ద కథే వుంది. ఒకరికి ఒక పెళ్లిచూపులోనే అమ్మాయి నచ్చవచ్చు, మరికోందరికి సీనిమాల్లో చూపినట్లుగా వందో పెళ్లిచూపులోనే.. ఆపైనో జరగోచ్చు. వధువు, వరుల విషయానికి వస్తే.. పెళ్లి కోడుకు బాగా ధనాన్ని ఆర్జించేవాడా అన్న విషయానికి అమ్మాయిలు మొదటి ప్రాధాన్యతనిస్తే.. ఆ తరువాత అబ్బాయిల అందచందాల గురించి ఆలోచిస్తారట. మరి అబ్బాయిలేం తక్కువ తిన్నారా..? అంటే అబ్బ అమ్మాయి అందంగా ఐశ్వర రాయ్ లా వుంటే.. కట్నం లేకపోయినా ఫర్వాలేదు. అమ్మాయి ఓ మాదిరిగా వుంటే కట్నం ఇంతివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరతారట. దీని గురించి మేం చెప్పడమెందుకు కానీ ఇండియాలో జరిగే పెళ్లిళ్ల తంతూ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పోందిందని చూపుతూ హాస్యభరితంగా రూపోందించిన ఈ వీడియో మీకు అన్ని వివరాలను తెలియజేస్తుంది..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arranged Marriages  Fixed  India  abroad  doubts.  messy  hullabaloo  secret  magic  tricks  

Other Articles